Begin typing your search above and press return to search.

సీనియర్‌ నటి మనోరమ అస్తమయం

By:  Tupaki Desk   |   10 Oct 2015 8:15 PM GMT
సీనియర్‌ నటి మనోరమ అస్తమయం
X
ఎన్నో సినిమాల్లో తల్లి పాత్రలు పోషించి.. తమిళ నటి అయ్యుండి కూడా తెలుగువారికి అత్యంత ఆప్తంగా మెలిగిన సీనియర్‌ నటి మనోరమ ఇక లేరు. ఆమె వయస్సు 78. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు.

1958 లో మాలిట్టా మంగై అనే తమిళ సినిమాతో తెరంగేట్రం చేసిన మనోరమ 1000 సినిమాలకు పైగా నటించారు. అంతేకాదు.. గిన్నీస్ రికార్డులో స్థానం కూడా సంపాదించారు. తమిళం, తెలుగు, మళయాళం, హిందీ భాషల్లో మనోరమ నటించిన ఆమె.. అప్పట్లో జెంటిల్ మేన్.. రిక్షావోడు.. బావనచ్చాడు.. మొదలగు సినిమాలతో అలరించి.. మొన్నామధ్య అరుంధతి సినిమాలో కనిపించారు.

1937, మే 26న తమిళనాడులోని మన్నార్ గుడిలో మనోరమ జన్మించారు. మనోరమ అసలు పేరు గోపీశాంత. 1955 లో ఫిలిం ఫేర్ లైఫ్ అఛీవ్ మెంట్ అవార్డు సాధించారు. 2002లో పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక అయ్యారు. గత ఫిబ్రవరిలో ఆమె చనిపోయినట్లు సడన్‌ గా టివిల్లో న్యూస్‌ రావడంతో.. నేను బ్రతికే ఉన్నానంటూ ఆమె మీడియా ముందుకొచ్చి స్టేట్‌మెంట్‌ కూడా ఇచ్చారు.

ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని తుపాకి.కామ్‌ ప్రార్దిస్తోంది.