Begin typing your search above and press return to search.

పూరీలో మ‌రో యాంగిల్ చెప్పిన సీనియ‌ర్ న‌టి

By:  Tupaki Desk   |   6 Jun 2018 7:38 AM GMT
పూరీలో మ‌రో యాంగిల్ చెప్పిన సీనియ‌ర్ న‌టి
X
సినిమా ప్ర‌పంచం మొత్తం పూర్తి రంగుల మ‌యం. ఎప్పుడు ఏ రంగు వెలిగిపోతుందో.. మ‌రెప్పుడు ఏ రంగు వెలిసిపోతుందో అస్స‌లు అర్థం కాన‌ట్లుగా ఉంటుంది. వెలిగిపోయిన‌ప్పుడు అంద‌రూ అభినందించేవారే. ఒక్క‌సారి వెలుగు క‌ళ త‌గ్గితే ఎవ‌రూ క‌నిపించ‌రు. ప‌లుక‌రించినా ప‌లుక‌రు. పూర్తి వాణిజ్య ధోర‌ణితో సినిమావాళ్లు ఉంటార‌న్న విమ‌ర్శ కొంత‌మేర నిజ‌మైనా.. అందులోనూ మ‌న‌సున్న మ‌నుషులు కొంద‌రు క‌నిపిస్తారు.

తాజాగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాద్ కు సంబంధించి.. ఇప్ప‌టివ‌ర‌కూ ఎవ‌రూ చూడ‌ని కొత్త కోణం గురించి చెప్పుకొచ్చారు సీనియ‌ర్ న‌టి ర‌మాప్ర‌భ‌. దాదాపు 1700 సినిమాల్లో న‌టించినా.. ఆమె ఆర్థికంగా కుదురుకోలేదు. దీనికి ఆమె న‌మ్మిన మ‌నుషులు చేసిన మోసాలు కూడా కార‌ణంగా చెబుతారు. ఇప్ప‌టికి ప‌ని చేయాల‌న్న ఉత్సాహం ఉన్నా.. అవ‌కాశాలు అంతంత మాత్రంగా ఉన్న ప‌రిస్థితి.

ప్ర‌స్తుతం చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లెలో నివ‌సిస్తున్న ఆమె.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. అయితే.. త‌న‌కున్న ఇబ్బంది గురించి ఎవ‌రికి చెప్పుకోలేనిది ఆమె త‌త్త్వం. ఇదిలా ఉంటే..ఆమె ఆర్థిక ఇబ్బందుల గురించి తెలుసుకున్న పూరీ జ‌గ‌న్నాద్ ఆమెను ఊహించ‌ని రీతిలో ఆదుకున్నారట‌.

పూరీ తీసిన చాలా సినిమాల్లో ర‌మాప్ర‌భ న‌టించారు. ఇటీవ‌ల ఒక చోట క‌లిసిన పూరీ.. మీ పుట్టిన‌రోజు ఎప్పుడ‌ని అడిగార‌ని.. తాను స‌మాధానం చెప్పి వ‌చ్చిన‌ట్లుగా ఆమె చెప్పారు. ఆ నెల నుంచి త‌న పుట్టిన‌రోజు తేదీన త‌న బ్యాంక్ అకౌంట్‌ కి రూ.20వేలు పంపుతున్నార‌ని చెప్పారు. మొద‌టి మూడు నెల‌లు త‌న‌కు ప్ర‌తి నెలా డ‌బ్బులు ఎవ‌రు వేస్తున్న‌ది త‌న‌కు తెలీలేద‌ని.. తెలుసుకుంటే ఆ డ‌బ్బుల్ని పూరీ పంపుతున్న‌ట్లుగా ఆమె చెప్పారు. అవ‌స‌ర‌మైన వారికి గుట్టుగా ఆర్థిక సాయం చేసే పెద్ద మ‌న‌సు పూరీలో ఉంద‌న్న వైనం ర‌మాప్ర‌భ కార‌ణంగా బ‌య‌ట‌కు రావ‌టం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.