Begin typing your search above and press return to search.
కరోనాతో సీనియర్ నటి కుమారుడు మృతి ... హస్పిటల్ లో భర్త !
By: Tupaki Desk | 17 Jun 2021 12:30 PM GMTప్రముఖ సినిమా నటి, కవిత కుమారుడు కరోనా కారణంగా కన్నుమూశారు. ఇక మరోవైపు ఆమె భర్త కరోనా తో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కవిత కుమారుడు జూన్ 15, మంగళవారం కరోనా వైరస్ కారణంగా ప్రాణాలను కోల్పోయాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆమె కుమారుడు సంజయ్ రూప్ కు కరోనా లక్షణాలను ఉండడంతో టెస్ట్ చేయగా, పాజిటివ్ అని వచ్చింది. దీనితో కొన్ని రోజులు ఇంట్లోనే హోమ్ క్వారెంటైన్ లో ఉన్నారు. అయితే అతని ఆరోగ్యం ఏ మాత్రం మెరుగపడలేదు. దీనితో అతన్ని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు.
ఇక మరోవైపు కవిత భర్త దశరథ రాజు కరోనా వైరస్ కారణంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కవిత కెరీర్ విషయానికి వస్తే, కవిత చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి అడుగుపెట్టారు. 1976 లో, కవిత తమిళంలో ఓహ్ మంజు, తెలుగులో సిరి సిరి మువ్వతో చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టారు. కవిత కేవలం 11 సంవత్సరాల వయసులో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి విజయవంతంగా రాణిస్తున్నారు. ఆమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడల భాషాల్లో కలిపి మొత్తంగా 300 కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆడ పాండవులు, చేతిలో చెయ్యేసి, మీనాక్షి, యుగళ గీతం వంటి చిత్రాలలో ఆమె సహాయక పాత్రల్లో నటించి పాపులర్ అయ్యారు. కవిత ప్రస్తుతం ఎండ్రాండ్రం పున్నగై అనే తమిళ టీవీ షోలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 1990లో దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా కవిత గుర్తింపు పొందారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. చాలా కాలం పాటు ఆ పార్టీకి సేవలందించారు. కానీ సరైన గుర్తింపు లేకపోవడంతో ఆ పార్టీ నుంచి బయటికొచ్చారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు.