Begin typing your search above and press return to search.
విజయశాంతి చెప్పిన ఆ మాటే నన్ను మార్చేసింది: వై.విజయ
By: Tupaki Desk | 26 Jun 2022 10:30 AM GMTవై.విజయ .. తెలుగు తెరపై హాస్యంతో కూడిన శృంగార భరితమైన పాత్రలకు ఆమె కేరాఫ్ అడ్రెస్. ఒక కేరక్టర్ ఆర్టిస్ట్ కూడా హీరోయిన్ తో సమానమైన గ్లామర్ తో కనిపించడమనేది వై.విజయతోనే మొదలైందని చెప్పచ్చు. ఆ మాటకొస్తే వై.విజయ హీరోయిన్ గానే తెలుగు తెరకి పరిచయమయ్యారు. ఆ తరువాతనే కేరక్టర్ ఆర్టిస్ట్ గా ముందుకు వెళ్లారు. 1970లో ఎంట్రీ ఇచ్చిన ఆమె, ఇప్పటివరకూ తన జోరును కొనసాగిస్తూనే వచ్చారు. ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన తరువాత ఆమెకి కాస్త గ్యాప్ వచ్చింది.
ఆ సమయంలో హైదరాబాద్ రాలేకపోయిన ఆమె, అక్కడ సీరియల్స్ చేస్తూ ఉండిపోయారు. అలా కొంత గ్యాప్ వచ్చినప్పటికీ, ఆ తరువాత మళ్లీ ఆమె గాడిలో పడిపోయారు. ప్రస్తుతం ఆమె హైదరాబాదులోనే ఉంటూ, సినిమాలను చేస్తూ వెళుతున్నారు. అప్పట్లో పెద్దగా చదువుకోకుండా సినిమాల్లోకి వచ్చిన లేడీ ఆర్టిస్టులు చాలామంది తమ అమాయకత్వం కారణంగా అనేక రకాలుగా మోసపోయారు. ముఖ్యంగా తాము సంపాదించిందంతా పోగొట్టుకుని, ఆర్థికపరమైన ఇబ్బందుల్లో పడ్డారు.
అయితే తాను మాత్రం ఈ విషయంలో జాగ్రత్తగానే ఉన్నానని తాజా ఇంటర్వ్యూలో వై.విజయ అన్నారు. జీవితంలో ఆర్ధికపరమైన భద్రత అనేది ఎంత అవసరమనేది నాకు ముందున్న కొంతమంది ఆర్టిస్టుల ఇబ్బందులను చూసి తెలుసుకున్నాను. అందువలన ముందుగా నేను ఒక సొంత ఇంటిని ఏర్పాటు చేసుకున్నాను. ఆ తరువాత ఒకానొక సందర్భంలో నేను .. విజయశాంతి కలిసి ఒక సినిమా కోసం ట్రైన్లో వెళ్లవలసి వచ్చింది. అప్పుడు ఆర్ధికపరమైన విషయాలను విజయశాంతి చెప్పుకొచ్చింది.
సినిమాల్లో అవకాశాలు ఎప్పుడు ఉంటాయో .. ఎప్పుడు ఉండవో తెలియదు. ఎప్పుడు ఖాళీగా ఉండిపోవలసి వచ్చేది ఎవరికీ తెలియదు. అందువలన ప్రతీనెలా కొంత ఎమౌంట్ వచ్చేలా చూసుకోమని సలహా ఇచ్చింది. దాంతో నేను .. మా వారు ప్లాన్ చేసుకుని, తంజావూరులో ఒక కల్యాణ మంటపం .. ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టాము. ఇప్పుడు వాటిపై వచ్చే ఆ రెంట్స్ తో మా జీవితం హ్యాపీగా సాగిపోతోంది. ఈ రోజున నేను ఇలా ఉండటానికి కారణం ఆ రోజునే విజయశాంతి చెప్పిన మాటను ఆచరణలో పెట్టడమే" అంటూ చెప్పుకొచ్చారు.