Begin typing your search above and press return to search.
సీనియర్ దర్శకనిర్మాత ఎఫైర్ల కహానీ తెరపై..?
By: Tupaki Desk | 14 Jan 2022 7:30 AM GMTఅతడు పరిశ్రమ అగ్ర నిర్మాతగా సుపరిచితుడు. లేట్ ఏజ్ లోనూ హీరోయిన్లతో ఘాటైన రొమాన్స్ సాగించేవాడిగా పాపులర్. తెరవెనక ఆమ్యామ్యాలో అతడిని కొట్టేవాళ్లే లేరు. నిర్మొహమాటస్తుడు. ఇక పబ్లిసిటీ పరంగానూ అతడు ఏ ఇతర స్టార్ కి తగ్గడు. తనకి అగ్ర హీరోయిన్ హోదా ఉన్న కుమార్తె ఉన్నా ఇప్పటికీ అతడు అంతే చెలరేగుతున్నాడు.
అతడు ఎవరో ప్రత్యేకించి చెప్పాల్సిన పనేలేదు. ది గ్రేట్ మహేష్ భట్. డా.డి రామానాయుడు జూనియర్ గా వచ్చి ఆయన తరహాలోనే బాలీవుడ్ లో అగ్ర నిర్మాతగా సత్తా చాటిన అతడు ఇప్పటికీ సినిమాల్ని నిర్మిస్తూ నవతరం నాయికలతో స్నేహం చేస్తూ హాట్ టాపిక్ గా మారుతున్నాడు. ఇంతకుముందు వివాదాస్పద రియా చక్రవర్తితో అతడి ఎఫైర్ కహానీ గురించి సంచలన కథనాలు వెలువడిన సంగతి తెలిసందే. అంతకుముందు ఇంకా పలువురు అగ్ర నాయికలు అతడి ఖాతాలో ఉన్నారు. ఇప్పుడు అతడి జీవితం స్ఫూర్తితో ఓ పాత్ర తెరపై కనిపించనుంది.
కథానాయికలతో నిర్మాత ఎఫైర్ల స్ఫూర్తితో ఇది రూపొందుతుండడం ఉత్కంఠ రేపుతోంది. బాలీవుడ్ నటుడు-నిర్మాత తాహిర్ రాజ్ భాసిన్ `రంజిష్ హి సాహి` అనే సిరీస్ తో ఏడాది ఆరంభంలోనే తొలి సక్సెస్ అందుకున్న అతడు.. ఇందులో ఈ చిత్రంలో 90ల నాటి చలన చిత్ర దర్శకుడి పాత్రలో నటించాడు. ఈ పాత్రని మహేష్ భట్ జీవితం నుంచి ప్రేరణ పొందినట్లుగా కూడా అనిపిస్తోందని గుసగుస హీటెక్కించింది.
ఇక నెట్ ప్లిక్స్ లోనే `కాళీ కాళీ అంఖేన్` అనే ట్రయాంగిల్ లవ్ స్టోరీలోనూ నటించాడు. ఇందులో రొమాంటిక్ హీరోగా తాహిర్ రాజ్ భాసిన్ అద్భుతంగా మెప్పించాడు. ఇక తాప్సీతో `లూప్ లాపేటా` లో కలిసి నటించిన రొమాంటిక్ సన్నివేశాలు రక్తి కట్టించాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో `రంజిష్ హాయ్ సాహి`లో 70 ల నాటి వైబ్ ని ఎలా రిక్రియేట్ చేసారంటే? ``ఇందులో నేను శారీరకంగా చేయాల్సిన అనేక విషయాలు ఉన్నాయి. నా పాత్ర నిడివి పెద్దది. 8-9 కిలోల బరువు పెరిగాను. కేశాలంకరణలో మార్పులు చేసాం.
పీరియాడిక్ సినిమాలు చేసేటప్పుడు ఒక జోన్ లోకి వెళ్లి చేయాల్సి ఉంటుంది . ఎన్నో మార్పులు ఉంటాయి. 70ల కాలం నాటి సెట్ ని బాగా వేసారు. ఆ నాటి వాతవరణం ప్రతిబించింది. నేడు అందుబాటులో ఉన్న సాంకేతికతను మొత్తం వదిలేసి ఓ కొత్త ప్రపంచంలోకి వెళ్లిపోతారు. షూట్ చేస్తున్న కెమారాలు..లైట్లు కూడా ఆనాటివే.
దీనికి మహేష్ భట్ క్రియేటివ్ ప్రొడ్యూసర్. కథలో 50 శాతం అతని నిజ జీవితసంఘటనల నుంచి ప్రేరణ పొందాము. మిగతా 50 శాతం కల్పితం. ఇది అతని బయోపిక్ కాదు. అతని కల్పిత పాత్ర. అతను 70 ల కాలం నాటి డైరెక్టర్ అయినందున అతని జీవితంలో కొన్ని కథలు ఇందులో భాగమయ్యాయి... అని తెలిపాడు.
ఇక తాప్సీతో `లూప్ లా పేటా` అనుభవల గురించి చెబుతూ..`` ఇది జర్మన్ కల్ట్ క్లాసిక్ `రన్ లో లా రన్` కు అనుసరణ. ప్రైమరీ ఛేంజ్ ఫిల్మ్. శృంగారం ప్రమాణం పెంచే చిత్రమిది. రొమాన్స్ కూడా పీక్స్ లో ఉంటుంది. సినిమాలో చక్కని వినోదం కూడా ఉంది. ఇందులో సత్య పాత్ర లో నటిస్తున్నా. చాలా కూల్ గయ్. అన్నింటికి షార్ట్ కట్స్ ఉంటాయని నమ్మే వ్యక్తి పాత్ర ఇది. కామెడీ..రొమాన్స్ తో కూడుకున్నది`` అని తెలిపాడు.