Begin typing your search above and press return to search.
వారసురాలి కోసం సీనియర్ హీరో పాట్లు
By: Tupaki Desk | 22 Jun 2022 5:30 PM GMTఓ రంగంలో సక్సెస్ అయిన వారు అదే రంగంలో తమ వారసులని కూడా దింపేయాని ప్లాన్ లు చేస్తుంటారు. వారి వారి ఇష్టాలని బట్టి వారసుల్ని రంగంలోకి దింపుతుంటారు. వారిని సక్సెస్ చేసి ట్రాక్ లోకి తీసుకురావాలని పాట్లు పడుతుంటారు. సినిమా రంగంలో వారసుల హడావిడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్టార్ హీరోలు, ప్రొడ్యూసర్ల, డైరెక్టర్ల వారసులని హీరోలుగా, హీరోయిన్ లుగా , డైరెక్టర్లుగా నిర్మాతలుగా పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఇప్పడు వారసులదే హవా. కొంత మంది వారసులు ఇప్పటికే స్టార్ లుగా వెలిగిపోతున్నారు. మరి కొంత మంది వారసులు స్టార్ డమ్ ని దక్కించుకోవడం కోసం ఫైట్ చేస్తున్నారు. మరి కొంత మంది తెరంగేట్రానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ సీనియర్ హీరో తన వారసురాలిని నిలబెట్టడం కోసం నానా పాట్లు పడుతుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
కోడి రామకృష్ణ రూపొందించిన 'మా పల్లెలో గోపాలుడు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై హీరోగా తనదైన ముద్ర వేశారు యాక్షన్ కింగ్ అర్జున్. ప్రస్తుతం కీలక పాత్రల్లో నటిస్తూ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో క్రేజీ చిత్రాల్లో నటిస్తున్నారు. 1998లో కన్నడ హీరోయిన్ ఆశారాణి ఉరాఫ్ నివేదిని వివాహం చేసుకున్నారు అర్జున్. వీరికి ఓ కూతురు వుంది. ఆమె ఐశ్వర్య. అందరి లాగే తనని హీరోయిన్ గా నిలబెట్టాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
విశాల్ నటించిన తమిళ చిత్రం 'పట్టాతు యానై'తో 2013 లో ఐశ్వర్యని హీరోయిన్ గా పరిచయం చేశారు. ఇదే మూవీని తెలుగులో 'ధీరుడు' పేరుతో రిలీజ్ చేశారు. రెండు భాషల్లోనూ ఈ మూవీ యావరేజ్ టాక్ నే సొంతం చేసుకుంది. ఆ తరువాత కన్నడ లో చందన్ కుమార్ హీరోగా 'ప్రేమ బరహా' పేరుతో ఓ మూవీని స్వయంగా అర్జున్ డైరెక్ట్ చేయడమే కాకుండా ఆయన భార్య నివేదిత ఈ మూవీని నిర్మించారు. 2018 లో విడుదలైన ఈ మూవీ కన్నడలో పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోయింది.
దీంతో తనకు అచ్చొచ్చిన తెలుగు ఇండస్ట్రీనే నమ్ముకున్నాడు అర్జున్. తన కూతురిని తెలుగులో అయినా హీరోయిన్ గా నిలబెట్టాలని మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా ఓ భారీ సినిమాకు శ్రీకారం చుట్టారు. ఈ మూవీ నిర్మాణ బాధ్యతలతో పాటు డైరెక్షన్ బాధ్యతల్ని కూడా అర్జున్ తన భూజాల మీద వేసుకున్నారు. ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా భావించిన అర్జున్ ఇందు కోసం పేరున్న టెక్నీషియన్ లని తీసుకోవడం మొదలు పెట్టారు. రైటర్ గా సాయి మాధవ్ బుర్రాని ఫైనల్ చేసుకున్న ఆయన తాజాగా 'కేజీఎఫ్'తో సంచలన సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రవి బాస్రూర్ ని సంగీత దర్శకుడిగా బుధవారం ఖరారు చేశారు. దీంతో ఈ మూవీపై సర్వత్రా ఆసక్తి మొదలైంది. తన కూతురు ఐశ్వర్య కోసం సీనియర్ హీరో అర్జున్ చేస్తున్న ప్రయత్రం ఫలించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.