Begin typing your search above and press return to search.

క్రికెటర్ తో కూతురి ప్రేమ - పెళ్లి వార్తలపై స్పందించిన సీనియర్ హీరో..!

By:  Tupaki Desk   |   24 Aug 2022 11:30 AM GMT
క్రికెటర్ తో కూతురి ప్రేమ - పెళ్లి వార్తలపై స్పందించిన సీనియర్ హీరో..!
X
ప్రముఖ టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ తో బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె, హీరోయిన్ అతియా శెట్టి ప్రేమాయణం సాగిస్తున్నట్లు చాలాకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా డేటింగ్ చేసిన ఈ లవ్ బర్డ్స్ తమ రిలేషన్ షిప్ ను గోప్యంగా ఉంచారు. ఎన్ని వార్తలు వచ్చినా.. పుకార్లు పుట్టుకొచ్చినా ఏమాత్రం స్పందించలేదు.

అయితే అథియా సోదరుడు అహన్ శెట్టి తెరంగేట్రం మూవీ 'తడప్' రిలీజ్ సందర్భంగా తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుంచి రాహుల్ - అతియా పెళ్లి గురించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాదే ఒక్కటవుతారని.. కాదు వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారంటూ రకరకాల రూమర్స్ వచ్చాయి.

ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ - అతియా శెట్టి వివాహంపై సునీల్ శెట్టి స్పందించాడు. వారిరువురు కోరుకున్నట్లు వివాహం జరిపిస్తామని తెలిపారు. రాహుల్ క్రికెట్ షెడ్యూల్స్ తో బిజీగా ఉన్నాడని.. పెళ్లి చేసుకోవడానికి తగినంత టైం దొరకడం లేదని చెప్పారు.

ఒకటి రెండు రోజులు విరామం దొరికినంత మాత్రాన వివాహం చేసేయలేం కదా? అని సునీల్ శెట్టి ప్రశ్నించారు. సమయం లభించినప్పుడే పెళ్లికి ప్లాన్ చేస్తామని.. ఈ విషయాన్ని మీడియాకు ముందుగానే తెలియజేస్తాని సీనియర్ హీరో తన కూతురి వెడ్డింగ్ గురించి చెప్పుకొచ్చారు. అది త్వరలోనే జరుగుతుందేమో చూడాలి.

కాగా, అతియా శెట్టి - కేఎల్ రాహుల్ కుటుంబ సభ్యులు ఇప్పటికే వారి పెళ్లికి ఏర్పాట్లు చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ముందుగా అనుకున్నట్లు నవంబర్ లేదా డిసెంబర్‌ లో కాకుండా.. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో వివాహం జరగవచ్చని నివేదికలు పేర్కొన్నాయి.

అంతేకాదు సెలబ్రిటీ కపుల్ పెళ్లి దక్షిణ భారత సంప్రదాయాల ప్రకారమే జరిగే అవకాశం ఉందని అంటున్నారు. సునీల్ శెట్టి మంగళూరులోని ముల్కిలోని జన్మించగా.. రాహుల్ కూడా అదే మంగళూరు కుటుంబానికి చెందినవాడనే సంగతి తెలిసిందే. అందుకే అతియా - రాహుల్ వివాహం సౌత్ ఇండియన్ స్టైల్ లో జరుగుతుందని చెబుతున్నారు.

అలానే పెళ్లి తర్వాత ఈ జంట కొత్త ఇంటికి మారనున్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. నివేదికల ప్రకారం, వీరిద్దరూ ముంబైలోని పాలి హిల్‌ లోని సంధు ప్యాలెస్‌ లోనవిలాసవంతమైన భవనంలో తమ కొత్త నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ మరియు క్రికెట్ కి ఉన్న సంబంధం ఇప్పటిది కాదు. ఎప్పట్నుంచో బాలీవుడ్ భామలు క్రికెటర్లని ప్రేమించి పెళ్లాడారు. ఈ క్రమంలో ఇప్పుడు అతియా శెట్టి - కెఎల్ రాహుల్ వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు.

సీనియర్ హీరోలలో ఒకరైన సునీల్ శెట్టి.. కుమార్తె అతియా ను 'హీరో' చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో నటించింది. మరోవైపు కెఎల్ రాహుల్ టీమిండియాలో స్టార్ క్రికెటర్ గా వెలుగొందుతున్నాడు. ఇక సునీల్ శెట్టి ఇటీవల కాలంలో పలు తెలుగు సినిమాల్లో నటించారు.