Begin typing your search above and press return to search.

అర‌వైలోనూ ఇర‌వై ఇందుకే గురూ!

By:  Tupaki Desk   |   27 April 2019 7:57 AM GMT
అర‌వైలోనూ ఇర‌వై ఇందుకే గురూ!
X
అర‌వైలో ఇర‌వై చూపించ‌డం ఎలానో తెలుసా? ఆ టాప్ సీక్రెట్ ఏంటో తెలియాలంటే టాలీవుడ్ అగ్ర హీరో నాగార్జున‌ను క‌ల‌సి టిప్స్ అడ‌గాల్సిందే. ఆయ‌నిచ్చే టిప్స్ పాటిస్తే చాలు అమృతం తాగాల్సిన ప‌నే లేకుండా నిత్య‌య‌వ్వ‌నంలోకి షిఫ్ట‌యిపోవ‌చ్చు. అస‌లు ఈ వ‌య‌సులో ఇంతందం ఎలా? అని ప్ర‌తిసారీ కింగ్ ని ప్ర‌శ్నించేవారికి ఆయ‌న ప్రాక్టిక‌ల్ గా చెబుతున్న స‌మాధానం ఇంట్రెస్టింగ్.

తినే తిండి తో పాటు క‌స‌ర‌త్తుల్లోనూ క్ర‌మ‌శిక్ష‌ణ అంటే ఏంటో ఆయ‌న ప‌క్కాగా లైవ్ లీగా చూపిస్తున్నారు. ఈ వ‌య‌సులో నాకెందుకులే అని నీర‌సించిపోలేదు. తినే తిండి.. క‌స‌ర‌త్తులు.. యోగా ప్ర‌తిదీ టైమ్ ప్ర‌కారం మెయింటెయిన్ చేస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. మ‌న‌సుండాలే కానీ రెండు తాళ్లు దొరికినా కార‌డ‌వికి వెళ్లిపోయి అక్క‌డ కూడా జిమ్ చేయొచ్చు అని నిరూపించి పెద్ద షాకిస్తున్నారు. ఆయ‌న జిమ్మింగ్ విధాన‌మే సంథింగ్ వెరైటీ అని ఇటీవ‌ల సామాజిక మాధ్య‌మాల్లో రివీలైన ఫోటోలు చెబుతున్నాయి. ఒక స్ట్రెచింగ్ బెల్ట్ ని షూటింగ్ ప‌రిస‌రాల్లోకి తీసుకెళ్లి లైవ్ లొకేష‌న్ ని జిమ్ గా మార్చేయ‌వ‌చ్చ‌ని గొప్ప సొల్యూషన్ ఇచ్చారు కింగ్. ఇది న‌వ‌త‌రం జిమ్నాస్టుల్లోనూ ఉత్సాహం నింపుతోంది. జిమ్ కి వెళితేనే క‌స‌ర‌త్తులు అనే ప‌ద్ధ‌తికి స్వ‌స్థి చెప్పి కింగ్ ని ఫాలో అయిపోతే త‌ప్పేం కాద‌న్న భావ‌న క‌లిగించారు ఈ ట్రిప్ తో.

`మన్మ‌ధుడు 2` అని టైటిల్ పెట్టుకుంటే స‌రిపోదు.. అచ్చ ంగా పాతికేళ్ల న‌వ‌మ‌న్మ‌ధుడిగా క‌నిపించేందుకు కింగ్ చేస్తున్న క‌ఠోర శ్రమ ఎంద‌రికో స్ఫూర్తినిస్తోంది. ఇటీవ‌లే చెట్టుకు త‌ల‌కిందులుగా వేలాడుతూ స్ట్రెచింగ్ బెల్ట్ తో క‌స‌ర‌త్తులు చేసిన నాగార్జున‌.. దానికి ఆపోజిట్ లో హెడ్ పైకి పెట్టి మ‌రో కొత్త ఫోజులో చేస్తున్న ఎక్స‌ర్ సైజులు షాకిస్తున్నాయి. ఒక్క బెల్టుపై ఇన్ని విన్యాసాలు సాధ్య‌మ‌ని కింగ్ మాబాగానే చెప్పారు. పోర్చుగ‌ల్ షూటింగ్ నుంచి కొన్ని ఫోటోలు నిన్న‌టిరోజున మీడియా గ్రూపుల్లోకి వ‌చ్చాయి. వీటిలో నాగార్జున .. ర‌కుల్ ప్రీత్ లాంటి యంగ్ గాళ్ తో పోటీప‌డుతూ టీనేజీ బోయ్ లా క‌నిపించి షాకిచ్చారు. పాతికేళ్లు వ‌య‌సును వెన‌క్కి తీసుకెళ్లిన ఆయ‌న్ను చూసి షాక్ తిన్నారు జ‌నం. ఇక పోర్చుగ‌ల్ లోని ఒక సువిశాల‌మైన‌ జిమ్ లో నాగార్జున - ర‌కుల్ .. క‌స‌ర‌త్తులు చేస్తున్న వీడియో నిన్న‌టిరోజున వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. మ‌న్మ‌ధుడు 2 చిత్రానికి రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వ ం వ‌హిస్తున్నారు. మ‌న్మ‌ధుడు చిత్రానికి సీక్వెల్ క‌థాంశాన్ని ఎంచుకున్నా నేటి ట్రెండ్ కి త‌గ్గ‌ట్టే తీర్చిదిద్దార‌ని తెలుస్తోంది. చెల్లెళ్ల పెళ్లిళ్ల కోసం వెయిట్ చేసి ముదిరిపోయిన బ్ర‌హ్మ‌చారిగా నాగార్జున న‌టిస్తున్నార‌ని .. ఆ క్ర‌మంలోనే పుట్టుకొచ్చే కామెడీ పొట్ట చెక్క‌ల‌య్యేలా న‌వ్విస్తుంద‌ని చెబుతున్నారు. విజ‌య‌భాస్క‌ర్ ని మించి న‌వ‌త‌రం ద‌ర్శ‌కుడు రాహుల్ ర‌వీంద్ర‌న్ ఈ సినిమాని హ్యాండిల్ చేస్తున్నారా.. లేదా? అన్న‌ది వేచి చూడాలి.