Begin typing your search above and press return to search.

కుర్ర హీరోయిన్లే కావాలంటున్న 60 ఏళ్ళ హీరో!

By:  Tupaki Desk   |   8 Sep 2019 2:30 PM GMT
కుర్ర హీరోయిన్లే కావాలంటున్న 60 ఏళ్ళ హీరో!
X
ఒకప్పుడు మహామహులైన అగ్ర హీరోలకు ఎంత వయసు వచ్చినా షష్టిపూర్తి చేసుకుని మనవళ్లను చూస్తున్నా వాళ్ళ పక్కన నటించేందుకు కుర్ర హీరోయిన్లు పోటీ పడేవాళ్ళు. సరిజోడి అనిపించకపోయినా సినిమాల్లో తగినంత మాస్ మసాలాలు ఉంటే చాలు వాటికి బ్రహ్మరథం పట్టేవాళ్ళు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. వంద కోట్ల మార్కెట్ ఉన్న యూత్ స్టార్లకే సరైన కాంబినేషన్ దొరక్క పక్క రాష్ట్రాల నుంచి ముంబై నుంచి వెతికి మరీ తీసుకురావాల్సి వస్తోంది. ఒకవేళ అదీ కుదరకపోతే సీనియర్ భామలను తీసుకోవడానికి సైతం వెనుకాడటం లేదు.

అలాంటిది ఆరు దశాబ్దాల వయసున్న ఓ సీనియర్ హీరోకు జంటను వెతకాలి అంటే ఎంత కష్టమో ఆలోచించవచ్చు. ఇప్పుడు ఈయనతో సినిమాలు ప్లాన్ చేసుకున్న దర్శకులకు ఇదే విషయంలో పెద్ద చిక్కొచ్చి పడింది. అదే హీరోయిన్ సమస్య. ఇటీవలే వచ్చిన ఈ హీరో సినిమా సూపర్ డిజాస్టర్ అయ్యింది. ఏదో రొమాంటిక్ గా చూపించుకోవాలన్న తాపత్రయం అసలుకే మోసం తెచ్చింది. ఇంత చెత్త సినిమా ఇప్పటిదాకా చూడలేదని అభిమానులే వాపోయారు. ఇందులో హీరోయిన్ అతి కష్టం మీద భారీ పారితోషికం ఇచ్చి సెట్ చేసుకున్నారు . కాని ఫలితం దక్కలేదు.

అయినా కూడా ఈ హీరో ఆలోచన ధోరణిలో మార్పు రావడం లేదట. సబ్జెక్టు ఏదైనా సరే కుర్ర హీరొయిన్లనే సెట్ చేయమని దర్శకులను ఒత్తిడి చేస్తున్నాడట. మరోవైపు ఎంత రెమ్యునరేషన్ ఇస్తామన్నా ఫాంలో ఉన్న హీరొయిన్లు ఈయన పక్కన నటించేందుకు సుముఖంగా లేకపోవడంతో సమస్య ఎంతకీ తీరడం లేదు. దీంతో కొత్త సినిమా ఇప్పటిదాకా స్టార్ట్ కాలేదని ఫిలిం నగర్ టాక్. ఎంత వయసు వచ్చినా ఇంకా కుర్ర భామలే కావాలని పట్టుబడితే ఎలా సారూ అంటున్నారు సదరు దర్శకులు