Begin typing your search above and press return to search.
సీనియర్ హీరోలందరికీ ఇక కష్టమే
By: Tupaki Desk | 27 May 2015 1:30 AM GMTటాలీవుడ్‌లో చిరంజీవిని మించిన హీరో ఎవరుంటారు? ఆయన సరసన హీరోయిన్‌గా చేయించడానికి లెక్కలేనన్ని ఆప్షన్లు ఉండేవి ఒకప్పుడు. కానీ ఇప్పుడు ట్రెండు మారిపోయింది. ఆయన వయసు మీరిపోయారు. ఆయన సినిమాలకు దూరంగా ఉన్న ఏడేళ్ల కాలంలో చాలా మార్పులొచ్చేశాయి. కొత్త తరం హీరోయిన్లు వచ్చేశారు. వాళ్లంతా కలిసి చిరు తమ్ముడు పవన్‌తో, కొడుకు రామ్‌చరణ్‌తో, మేనల్లుడు బన్నీతో ఆడిపాడేశారు. వీళ్లతో నటించని హీరోయిన్‌ను ఎంచుకోవడం చిరుకు చాలా కష్టమవుతోంది. అన్నీ ఖరారైనా చిరు పక్కన హీరోయిన్ ఎవరన్నది మాత్రం తేలలేదు.
చిరు మాత్రమే కాదు.. సీనియర్ హీరోలందరికీ హీరోయిన్ల సమస్యే ఉంది. బాలయ్య ప్రతి సినిమాకూ హీరోయిన్ల వేట కష్టమైపోతోంది. లయన్ సినిమా కోసం ఎవరూ దొరక్క చివరికి ఫేడ్ అవుట్ అయిపోయిన త్రిషను తీసుకొచ్చారు. ఆయన కొత్త సినిమా 'డిక్టేటర్'కు కూడా హీరోయిన్ ప్రాబ్లెం ఉంది. బాలయ్య రేంజికి సరిపోకున్నా.. అంజలిని ఓ హీరోయిన్‌గా ఎంపిక చేయాల్సిన పరిస్థితి. ఇంకో హీరోయిన్ ఎవరన్నది తేలడం లేదు. వెంకటేష్‌కు కూడా కొన్ని సినిమాల నుంచి హీరోయిన్ల సమస్య ఎదురవుతోంది. అంజలితో రెండు సినిమాలు లాగించారు. గోపాల గోపాల కోసం శ్రియను తీసుకున్నారు. ఇక కొత్త సినిమా కోసం వేట సాగించాల్సి ఉంది. నాగార్జున కూడా ఇలాగే ఇబ్బంది పడుతున్నాడు. వెతికి వెతికి 'సోగ్గాడా చిన్నినాయనా' కోసం లావణ్య త్రిపాఠిని తీసుకున్నారు. కార్తితో చేస్తున్న సినిమాలో నాగ్‌కు హీరోయినే లేదంటున్నారు. నాగ్ తర్వాత చేయబోయే సినిమాలకు కూడా హీరోయిన్ ట్రబుల్ తప్పేట్లు లేదు. ఒకప్పుడైతే 60 ఏళ్లు దాటాక కూడా పడుచు హీరోయిన్లతో బండి లాగించేవారు కానీ.. ఇప్పుడు సీనియర్ హీరోల పక్కన యంగ్ లేడీస్‌ను పెడితే ప్రేక్షకులు అంగీకరించే పరిస్థితి లేదు. మున్ముందు సీనియర్ హీరోలకు ఇంకా గడ్డు పరిస్థితులు తప్పేట్లు లేవు.