Begin typing your search above and press return to search.
స్టార్ హీరోతో ఎఫైర్ హాటీని అంతగా ముంచిందా?
By: Tupaki Desk | 19 April 2020 5:28 AM GMTఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన కథానాయికగా నటించింది సదరు బ్యూటీ. అదరగొట్టే డ్యాన్సులు.. కవ్వించే లుక్ తో ఈ అమ్మడు మతి చెడగొట్టేది. వెండితెరపై ఈ కొంటె హీరోయిన్ రతి రాణి వేషాలకు కుర్రకారు కలల్లో కల్లోలానికి గురయ్యేవారు. ఒక రకంగా స్టార్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్ స్టాటస్ ని అందుకోగలిగిందంటే తనలోని ఈ ట్యాలెంటే. హైదరాబాదీ మూలాలున్న ఈ అమ్మడు అటు ముంబై పరిశ్రమలోనూ పెద్ద స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంది.
ఇక్కడే అచ్చులో బొమ్మ తిరగబడింది. కెరీర్ పీక్స్ లో ఉండగానే.. ఓ యంగ్ తెలుగు హీరోతో నిండా ప్రేమలో మునిగింది. అప్పుడే రైజింగ్ స్టార్ గా మాస్ లో మ్యాసివ్ స్టార్ డమ్ తో దూసుకుపోతున్న ఆ యంగ్ హీరోని ఘాడంగా ప్రేమించింది. అతడితో చెట్టా పట్టాల్ అంటూ పబ్లిగ్గానే షికార్లు చేసేస్తుండడంతో ఆ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని తొందర్లోనే పెళ్లాడుకుంటారని ప్రచారమైంది. ఒకానొక సందర్భంలో సదరు యంగ్ ఎనర్జిటిక్ డ్యాన్సింగ్ హీరోని పెళ్లాడేసిందని కూడా కాస్త అడ్వాన్స్ డ్ గా ప్రచారం సాగించేశారు. అయితే తామిద్దరం ప్రేమలో ఉన్నామని ఆ జంట ఏనాడూ అధికారికంగా ప్రకటించలేదు. ఇక సదరు స్టార్ హీరోతో ఎఫైర్ వార్తలు తన కెరీర్ ని నిండా ముంచాయన్న ఆవేదనను సదరు నాయిక పదే పదే మీడియా ముఖంగానే వెల్లడించేది. తమ మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే.. కానీ బయట ప్రచారం అలా సాగిపోయింది. అందుకే ఇద్దరం విడిపోయామని సదరు నాయిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి వెల్లడించింది. తాను తమిళ పరిశ్రమకు వెళ్లిపోవడానికి కారణం ఈ రూమర్లేనని కూడా చెప్పుకుని ఆవేదన చెందింది. సదరు నాయికతో ఎఫైర్ అన్న ప్రచారం సాగడంతో ఆ స్టార్ హీరో కూడా తనకు దూరమైపోయాడు.
అయితే ఇన్నేళ్ల తర్వాత కూడా అదే పాత విషయాన్ని సదరు హీరోయిన్ మీడియా ఇంటర్వ్యూల్లో గుర్తు చేసుకోవడం ఇబ్బందికరమే. పెళ్లయి ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చిన సదరు సీనియర్ బ్యూటీ ఇలా చేయడం ఏమీ బాలేదని సదరు స్టార్ హీరో ఫ్యాన్స్ గుర్రుమీద ఉన్నారట. అసలే మనోడికి కూడా పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారు. ఇలాంటప్పడు ఇలా మీడియా ముందుకొచ్చి పాత విషయాలు కెలకడం సరైనదేనా? అని హీరో గారి ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.