Begin typing your search above and press return to search.
వెటరన్ అంటే హీరోయిన్ల మేనేజర్లు ఫోన్లు ఎత్తరా?
By: Tupaki Desk | 1 Dec 2019 1:30 AM GMTవెటరన్ హీరోలకు కథానాయికను వెతకడం అంత సులువు కాదన్న సంగతి తెలిసిందే. ప్రతిసారీ భారీ కాన్వాసుతో సీనియర్ హీరోల సినిమాల్ని ప్రకటించినా కథానాయికను వెతికేప్పటికి చాలా సమయం వృధా అవుతోంది. కావాలనుకున్న కథానాయికలు ఎవరూ వెటరన్స్ తో చేసేందుకు వెంటనే సిద్ధం కాకపోవడమే అందుకు కారణం అనుకుంటే కొత్త భామల్లో సరైన ట్యాలెంటును వెతకాలన్నా అంత సులువుగా కుదరే పని కాదు.
ఆ క్రమంలోనే సీనియర్ భామల్లో ఎవరున్నారు? అని వెతికితే చాలా మందికి శ్రీయనో లేదా త్రిషనో కనిపిస్తున్నారు. ఇక త్రిష తమిళం వరకే ప్రాధాన్యతనిస్తున్నట్టు కనిపిస్తోంది కాబట్టి చివరికి శ్రీయ పైనే డిపెండ్ కావాల్సి వస్తోంది. ఇప్పటికే పదిహేనేళ్లుగా కెరీర్ ని తెలివిగా నెట్టుకొచ్చేస్తున్న శ్రీయ ఇటీవలే ప్రియుడు ఆండ్రూ కోశ్చీవ్ ని పెళ్లాడి విదేశీ షికార్లతో బిజీ అయిపోయింది.
అప్పుడప్పుడు మన వెటరన్స్ నుంచి పిలుపు అందుకుని ఇక్కడ దిగుతోంది. ఇకపోతే ఇటీవలే అసురన్ రీమేక్ కోసం విక్టరీ వెంకటేష్ కి ఓకే చెప్పింది. అంతకుముందు నాగార్జున .. బాలకృష్ణ లాంటి స్టార్లకు శ్రీయ కథానాయికగా అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. శ్రీయ ఒక్కర్తెనే ఇప్పటికిప్పుడు ఆప్షన్ గా కనిపిస్తోంది. ఇక నయనతార.. తమన్నా.. కాజల్ లాంటి భామల దృష్టి పూర్తిగా వేరే వైపు ఉండడం కూడా సీనియర్లకు సమస్యాత్మకంగా మారింది.
అసలు టాలీవుడ్ లో వెటరన్ హీరోల సరసన ఛాన్స్ అంటే హీరోయిన్ల మేనేజర్లు ఫోన్లు కూడా ఎత్తడం లేదట. అలా సీనియర్లకు ఓకే చెప్పేస్తే.. యంగ్ హీరోలు ఛాన్సులివ్వరనేది వీళ్ల భయం అట. మునుముందు ఇదే పరిస్థితి ఎదురైతే వెటరన్స్ అంతా నెమ్మదిగా క్యారెక్టర్లు వెతుక్కోవాలేమో!