Begin typing your search above and press return to search.
పెళ్లంటే బాబోయ్ అంటున్న సీనియర్ భామలు
By: Tupaki Desk | 28 Jun 2021 2:30 AM GMTఅమ్మాయికి 18 ..అబ్బాయికి 21.. యువతీయువకుల పెళ్లికి రాజ్యాంగం నిర్ణయించిన వయసు ఇది. కానీ చట్టం చెప్పినట్లు ఎక్కడ జరుగుతోంది? పైగా ఇప్పుడు పూర్తిగా పెళ్లిళ్ల స్వరూపమే మారిపోయింది. చదువులు.. జీవితంలో స్థిరపడటం.. గోల్స్ ఇలా ఎన్నో పెళ్లిని ప్రభావితం చేస్తున్నాయి. ఇలాంటి తీరని లక్ష్యాలు ఊహించని పరిస్థితులు పెళ్లి అనే తీపి ఘడియను మరింతగా వాయిదా పడేలా చేస్తున్నాయి. కారణం ఏదైనా నేటి వివాహ వ్యవస్థ ఒత్తిళ్లతో వైరాగ్యంలోకి నెట్టేస్తున్నాయని సర్వేలు నిరూపించాయి.
దేశ వ్యాప్తంగా ఎంతోమంది పెళ్లి కాని ప్రసాదులున్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో బ్యాచిలర్ షిప్ పెరుగుతోందని నివేదికలు చెబుతున్నాయి. ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే ఆ సంఖ్య భారీగానే ఉంది. ప్రధానంగా సెలబ్రిటీ వరల్డ్ లో ప్రీడమ్ కోల్పోతామనే కారణం...స్వేచ్ఛను పెళ్లి హరించేస్తుందన్న భావన ప్రధానంగా కనిపిస్తోంది. పెళ్లైన జంటలు సైతం విడాకులు తీసుకోవడం ఎక్కువైంది. వాళ్ల అనుభవాలు సైతం నవతరాన్ని మరింత గందరగోళానికి గురి చేస్తున్నాయన్నది వాస్తవం. సెలబ్రిటీలు పెళ్లికి ముందు సహజీవనం..రిలేషన్ షిప్ అంటూ అధునాతన పంథాలో కొనసాగుతున్నారు.
కారణాలేవైనా కొంత మంది హీరోయిన్లు పెళ్లి అంటే బాబోయ్ అంటున్నారన్నది అందరికీ తెలిసిన వాస్తవం. కత్రినా కైఫ్.. కియారా అద్వాణీ.. అనుష్క.. రకుల్ ప్రీత్ సింగ్.. పూజా హెగ్దే .. నయనతార.. శ్రీముఖి.. తమన్నా.. తాప్సీ.. ఇలా చాలా మంది సీనియర్ భామలు పెళ్లికి ససేమిరా అనేస్తున్నారని కొన్ని మీడియా కథనాలు వేడెక్కించాయి. ప్రేమ- రిలేషన్ షిప్ వంటివి తమ జీవితాల్లో ఎంతో పనికొచ్చాయని.. సహజీవనం అనేది పెళ్లికి ముందే వందేళ్ల జీవితాన్ని అర్థం చేసుకునే అనుభవాల్ని ఇస్తుందని చెప్పకనే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు చాలామంది. ఇలాంటి బంధం సరికాదని కోర్టులు చెబుతున్నా.. జంటల్ని అర్థం చేసుకుని ఆశీర్వదించాల్సిన సన్నివేశం నేటి సొసైటీకి తప్పడం లేదు.