Begin typing your search above and press return to search.
కోటకు కోట చేసుకుంటున్న నష్టం
By: Tupaki Desk | 11 May 2022 5:30 AM GMTహీరోయిజం, స్టార్ ఇమేజ్ లాంటివన్నీ పక్కన పెట్టేసి.. తెలుగు సినీ చరిత్రలో అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే అందులో టాప్‌లో కనిపించే పేర్లలో కోట శ్రీనివాసరావు ఒకటి. ఆయన ఎంత గొప్ప నటుడో కొత్తగా ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. శత్రువు, గణేష్ లాంటి చిత్రాలతో 90వ దశకంలో దేశంలోనే అత్యుత్తమ నటుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడాయన. ఆయన నటనా స్థాయిని చాటి చెప్పే మరెన్నో సినిమాలు, పాత్రలు ఉన్నాయి.
కోట లాంటి నటుడు మన పరిశ్రమలో ఉండడం తెలుగు ప్రేక్షకులు చేసుకున్న అదృష్టం అనడంలో మరో మాట లేదు. 80వ దశకంలో ఎన్టీఆర్‌ను అనుకరిస్తూ మండలాదీశుడు అనే సెటైరికల్ సినిమా చేయడం తప్పితే.. కొన్నేళ్ల ముందు వరకు కోట పెద్దగా వివాదాల్లో జోక్యం చేసుకున్నది లేదు.
ఎవరి గురించీ ఆయన కటువుగా మాట్లాడింది, తీవ్ర విమర్శలు చేసింది కూడా లేదు. గతంలో ప్రకాష్ రాజ్ మీద విమర్శలు చేసినా కూడా అవి సహేతుకంగానే అనిపించాయి. గతంలో కోట కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోతే అందరూ అయ్యో అనుకుని బాధ పడ్డవాళ్లే.
మొత్తంగా చూస్తే కోటది చాలా వరకు క్లీన్ ఇమేజే. ఒక నటుడిగా ఆయన స్థాయి అందరికీ తెలిసిందే. అందరూ ఆయన్ని ఎంతో అభిమానిస్తారు. సామాజిక మాధ్యమాల్లో కూడా నెటిజన్లు ఆయన నటనను కొనియాడుతూ.. ఆయన స్థాయిని తెలియజేస్తూ వీడియోలు పెడుతుంటారు. ప్రశంసలు కురిపిస్తున్నారు. ఐతే ఇన్నాళ్లూ అందరివాడులా ఉన్న కోట.. ఇప్పుడు ఉన్నట్లుండి అనవసర వ్యాఖ్యలతో వ్యతిరేకత మూటగట్టుకుంటుండటం ఆశ్చర్యం కలిగించే విషయం.
నటనకు దాదాపుగా గుడ్‌బై చెప్పేసి ఇంటి పట్టున ఉంటున్న సమయంలో ఆయన లేని వివాదాలను కొని తెచ్చుకుంటున్నారు. ఒక గొప్ప నటుడిగా, దిగ్గజ హోదాలో అందరికీ గుర్తుండాల్సిన కోట.. ఇండస్ట్రీ కోసం ఎంతో చేస్తున్న చిరంజీవిని అనవసరంగా టార్గెట్ చేయడం, చరణ్ మీద కూడా విమర్శలు చేయడం మెగా అభిమానులకే కాదు.. న్యూట్రల్ ఆడియన్స్‌కు కూడా నచ్చట్లేదు. ఏదో మనసులో పెట్టుకుని విమర్శలు చేస్తున్నట్లు అనిపిస్తోంది.
మానసికంగా ఆయన సరైన స్థితిలోనే ఉన్నారా అనే సందేహాలు రేకెత్తించే స్థాయిలో ఉన్నాయి ఆయన మాటలు. కెరీర్లో ఈ దశలో, ఈ వయసులో ఇలాంటి విమర్శలు చేయడం వల్ల ఆయనకు ఒరిగేదేంటన్నది ప్రశ్న. ఇది కోరి వివాదం తెచ్చుకోవడమే. ఈ విమర్శల కారణంగా ఆయన స్థాయి తగ్గుతోందే తప్ప పెరగదు. మెగా అభిమానులంటే చిన్న సంఖ్యలో ఉండరు. మామూలుగా అయితే వాళ్లందరూ కూడా కోటను ఇష్టపడేవారే అయ్యుంటారు. వారితో పాటు న్యూట్రల్‌గా ఉండే జనాల్లోనూ చాలామందికి కోట వ్యాఖ్యలు రుచించట్లేదు. ఇప్పుడీ అనవసర వ్యతిరేకతతో కోట తనకు వ్యక్తిగతంగా చాలా నష్టమే చేసుకుంటున్నారని చెప్పాలి.