Begin typing your search above and press return to search.
#RRR రైట్స్: ఎరక్కపోయి ఇరుక్కుపోయావా రాజా
By: Tupaki Desk | 10 April 2020 4:00 AM GMTఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు! .. తెలుగు వాడు ఎప్పటికీ మర్చిపోలేని క్లాసిక్ గీతమిది. ఘంటసాల గానామృతానికి పరవశించని వాడు.. ఆ పాటను తాజా సన్నివేశానికి అన్వయించుకుని పదే పదే ఆలపించని వాడు లేనే లేడు. ప్రస్తుత టాలీవుడ్ లో ఓ అగ్ర నిర్మాత కం ఎగ్జిబిటర్ కం పంపిణీదారుడి సన్నివేశం అలానే ఉందట.
ఓవర్ నైట్ ఫేట్ మారిపోయింది. తానొకటి తలిస్తే దైవమొకటి తలిచింది అన్న చందంగా విధి వైచిత్రి తనని ఊహించని విధంగా చిక్కుల్లో పడేసిందని చెబుతున్నారు. ఒకే ఒక్క కరోనా బాంబ్ అణు విస్పోటనంలా సదరు పంపిణీదారుడి గుండెల్లోకి మిసైల్ ని విసిరిందని చెబుతున్నారు. కరోనా బయోవార్ ముందే ఊహించినది కానేకాదు. దీంతో అప్పటికే అడ్వాన్సులు ఇచ్చి పాన్ ఇండియా సినిమా ఆర్.ఆర్.ఆర్ ని నైజాంలో భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారట. అందుకోసం ఏకంగా 76 కోట్ల మేర బేరం మాట్లాడుకున్నారు. అయితే తాజాగా ఊహించని కరోనా పిడుగు అమాంతం మార్కెట్ స్ట్రక్చర్ నే మార్చేసింది.
జనం థియేటర్లకు రావాలంటేనే భయం భయంగా ఉన్నారు. ఈ ఫియర్ ఇప్పట్లో తగ్గేట్టు లేదు. తెలుగు రాష్ట్రాలు సహా ప్రపంచవ్యాప్తంగా అంతకంతకు భయోత్పాతం పెరుగుతూనే ఉంది. కరోనా మహమ్మారీ ఎట్నుంచి ఎటు నమిలేస్తుందోనన్న టెన్షన్ నిలవనీయడం లేదు. ఇలాంటప్పుడు అంత పెద్ద సినిమాని అంత పెద్ద మొత్తం పెట్టి కొనుక్కుని రిలీజ్ చేస్తే జనం థియేటర్లకు రాకపోతే పరిస్థితి ఏంటి? అన్నదే సదరు పంపిణీదారుడి బుర్ర తొలిచేస్తోందట. దీంతో ఇప్పుడు సదరు బయ్యరు కం పంపిణీదారు రేటు తగ్గించమని నిర్మాతల్ని బతిమాలుతున్నాడట. అయితే అందుకు ససేమిరా అంటున్నారని.. అడ్వాన్స్ ఇచ్చాక కుదరదని.. ఒకవేళ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చని కూడా చెప్పేశారట. అసలే 15 కోట్ల మేర అడ్వాన్స్ ఇచ్చి ఇరుక్కున్న తర్వాత డీల్ క్యాన్సిల్ చేసుకోవాలంటే కుదురుతుందా? అందుకే ఎరక్కపోయి ఇరుక్కుపోయారన్న గుసగుసలు ఫిలింసర్కిల్స్ ని వేడెక్కిస్తున్నాయ్. కరోనా వ్యాక్సినేషన్ వచ్చేందుకే ఇంకో ఏడాది పట్టవచ్చన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అప్పటి వరకూ మనిషి స్థిమితపడతాడా? అన్నది డౌట్. మరి ఏం జరగనుందో వేచి చూడాలి.