Begin typing your search above and press return to search.
యాంకర్ రష్మీపై సీనియర్ ప్రొడ్యూసర్ షాకింగ్ కామెంట్స్..!
By: Tupaki Desk | 15 March 2022 5:30 PM GMTతెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు రష్మీ గౌతమ్. ప్రస్తుతం బుల్లితెరపై స్టార్ యాంకర్ గా దూసుకుపోతున్న తెచ్చుకున్న ఈ బ్యూటీకి స్టార్ హీరోయిన్లతో సమానమైన క్రేజ్ ఉంది. యాంకరింగ్ చేయడంలో తనకంటూ ప్రత్యేకత చాటుకున్న రష్మీ.. స్మాల్ స్క్రీన్ కు గ్లామర్ ను అద్దిన యాంకర్లలో ముందు వరుసలో ఉంటుంది.
వాస్తవానికి మొదట వెండితెరపై చిన్న చిన్న పాత్రల్లో మెరిసిన రష్మీ గౌతమ్.. సిల్వర్ స్క్రీన్ మీద సక్సెస్ కాలేకపోయింది. ఆ మధ్య ‘గుంటూరు టాకీస్’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించి రెచ్చిపోయి అందాలు ఆరబోసినా లాభం లేకపోయింది. దీంతో యాంకరింగ్ వైపు అడుగులు వేసిన ఈ బ్యూటీ.. బుల్లితెరపై తన హవా చూపిస్తోంది.
స్టేజీ మీద అందాలు ఆరబోస్తూ యాంకరింగ్ లో నూతన ఒరవడిని సృష్టించడం మొదలుపెట్టింది రష్మీ. ఈ క్రమంలో సినిమా అవకాశాలు కూడా అందుకుంటోంది. నందు విజయ కృష్ణ సరసన రష్మీ గౌతమ్ హీరోయిన్ గా నటించిన 'బొమ్మ బ్లాక్ బ్లాస్టర్' మూవీ విడుదల కావాల్సి ఉంది.
ఇదిలా ఉంటే రష్మీపై తాజాగా నిర్మాత బాలాజీ నాగలింగం షాకింగ్ కామెంట్స్ చేశాడు. 'రాణి గారి బంగ్లా' అనే సినిమా విషయంలో రేష్మీ తనను ఇబ్బంది పెట్టిందంటూ ఆరోపణలు చేశాడు. ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆయన తాను ఫిలిం ఛాంబర్ గేట్ కి రష్మీని కట్టేస్తానని ఎందుకు అనాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు.
''రష్మీ మాతో 'రాణి వారి బంగ్లా' అనే మూవీ చేసింది. టాకీ పార్ట్ షూటింగ్ అంతా పూర్తైన తర్వాత ఓ పాట షూటింగ్ - డబ్బింగ్ సమయానికి తాను చేయనంటూ ఇబ్బంది పెట్టింది. సినిమా ఆఖరికి వచ్చాక ఇలా చేయాలని ఆమె ముందే ప్లాన్ చేసుకుంది. అంతా అయిపోయి ఒక సాంగ్ చేయాల్సి ఉంటే హీరోని మార్చాలని డిమాండ్ చేసింది'' అని నిర్మాత చెప్పుకొచ్చారు.
ఆ సమయంలో రేష్మీ తనకు ‘నాకు నాగబాబు తెలుసు.. మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి తెలుసు.. న్యూస్ ఛానల్ కు వెళ్తా’ అంటూ బెదిరించిందని తెలిపాడు. తాను ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నానని.. తనకు నాగబాబు - శ్యామ్ లతో మంచి అనుబంధం ఉందని నాగలింగం పేర్కొన్నాడు.
ఫిల్మ్ చాంబర్ గేటుకు కట్టివేస్తానని రేష్మీతో అన్న మాట వాస్తవమేనని.. కానీ ఆమె ఎంతో బాధ పెట్టింది కాబట్టే అలా అనాల్సి వచ్చిందన్నారు. నన్ను బెదిరించింది కాబట్టే నిజం చెప్పమని అలాంటి కామెంట్స్ చేశానని.. అవి ఉద్దేశపూర్వంగా చేసిన వ్యాఖ్యలు కాదన్నారు. రష్మీ తనతో మాట్లాడిన రికార్డింగ్ ఇప్పటికీ తన దగ్గర ఉందని తెలిపారు.
రెమ్యూనరేషన్ మొత్తం తీసుకొని కూడా బ్లాక్ మెయిల్ చేస్తూ మూడు నెలలు రష్మీ ఇబ్బంది పెట్టిందని సీనియర్ నిర్మాత తెలిపారు. న్యాయపరమైన చర్యలు దిగుతానని చివరకు మిగతా షూటింగ్ పూర్తి చేసిందని అన్నారు. అయితే రష్మీ చాలా మంచి ఆర్టిస్ట్ అని.. ఏనాడు కూడా సెకండ్ టేక్ తీసుకోలేదంటూ ఆమెను ప్రశంసించారు నిర్మాత నాగలింగం.