Begin typing your search above and press return to search.
సీనియర్ స్టార్ లవ్ బర్డ్స్ పెళ్లికి సిద్దం
By: Tupaki Desk | 5 Jan 2022 5:34 AM GMTబాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో ఫర్హాన్ అక్తర్ పెళ్లికి సిద్దం అయ్యాడు. అయిదు పదుల వయసుకు చేరువ అయిన ఈయన చాలా కాలంగా పెళ్లి విషయంలో వార్తల్లో నిలుస్తున్నారు. ఈయన కూడా సల్మాన్ ఖాన్ తరహా లో సోలోగా మిగిలి పోతాడా అంటూ వార్తలు వస్తున్న సమయంలో పెళ్లికి సంబంధించిన వార్తను సన్నిహితులు ప్రకటించారు. ఫర్హాన్ అక్తర్ చాలా కాలంగా శిభాని దండేఖర్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇద్దరు కూడా పలు సందర్బాల్లో కలిసి కనిపించారు. ఇద్దరు కూడా ఒకరి గురించి ఒకరు చాలా పాజిటివ్ గా మాట్లాడిన సందర్బాలు ఉన్నాయి. ఇద్దరి వ్యవహారం బాలీవుడ్ లో అందరికి తెల్సిందే. వీరి విషయమై మీడియాలో చాలా కాలం గా వార్తలు వస్తూనే ఉన్నాయి.
ఇటీవలే బాలీవేడ్ క్యూట్ అండ్ సూపర్ హాట్ లవ్ బర్డ్స్ కత్రీనా కైఫ్ మరియు విక్కీ కౌశల్ లు పెళ్లి చేసుకుని కొత్త జీవితంను ప్రారంభించారు. ఇద్దరు కూడా సంతోషంగా వారి జీవితాన్ని గడుపుతున్నారు. బాలీవుడ్ కు చెందిన లవ్ బర్డ్స్ పెళ్లిలు ఈమద్య కాలంలో చాలా కామన్ అయ్యాయి. విక్కీ కౌశల్ మరియు కత్రీనా కైఫ్ ల దారిలోనే సీనియర్ నటుడు ఫర్హాన్ అక్తర్ కూడా ప్రేయసిని పెళ్లి చేసుకునేందుకు సిద్దం అయ్యాడు. వీరి పెళ్లి 2022 లోనే ఉంటుందని సన్నిహితులు నమ్మకంగా చెబుతున్నారు. ఎప్పుడు ఉంటుంది.. వారి పెళ్లి ఎలా జరుగుతుంది అనే విషయాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు బాలీవుడ్ మీడియా వర్గాల వారు అంటున్నారు.
గత ఏడాది తుఫాన్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఫర్హాన్ అక్తర్ ఈ వయసులో కూడా కుమ్మేశాడు రా అనిపించుకున్నాడు. భారీ అంచనాల నడుమ ఇప్పటికి కూడా ఆయన నటిస్తున్న సినిమాలు రూపొందుతున్నాయి. అందులో కొన్ని సినిమాలు ఈ ఏడాదిలో విడుదల అయ్యే అవకాశం ఉంది. 48 ఏళ్ల ఫర్హాన్ అక్తర్ మరో పదేళ్లు అయినా కూడా అదే ఫిజిక్ మరియు అదే తరహా స్టైల్ తో సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. తుఫాన్ కోసం అతడు సిక్స్ ప్యాక్ చేయడం అభిమానులతో పాటు ప్రతి ఒక్కరిని కూడా అలరించింది. అయిదు పదుల వయసు దగ్గర పడుతున్న సమయంలో ఆయన పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధం అవ్వడం అభిమానులకు మరియు సన్నిహితులకు కాస్త ఊరట కలిగిస్తుందంటూ మీడియా వర్గాల వారు చర్చించుకుంటున్నారు.