Begin typing your search above and press return to search.
చిరు-అమీర్ ఉన్న వేదికపైనే సీనియర్ టెక్నీషియన్ ఆవేదన
By: Tupaki Desk | 21 Sep 2021 4:45 AM GMTతెలుగు చిత్రసీమలో సాంకేతిక నిపుణులకు సరైన గౌరవం దక్కడం లేదా? దర్శకుడు.. సంగీత దర్శకుడు కెమెరామేన్ గురించి తప్ప ఇతర సాంకేతిక బృందాన్ని హీరోలు కానీ ఇతరులు కానీ పట్టించుకోరా? అంటే అవుననే ఆవేదన టెక్నీషియన్లలో చాలా కాలంగానే ఉంది. తెర పై కనిపించే స్టార్లకు ఉన్న గుర్తింపు తెరవెనక వారియర్ లా పని చేసే సాంకేతిక నిపుణులకు ఉండదన్నది జగమెరిగిన సత్యం.
ఇక పూర్తిగా తెరవెనక ఉండి పని చేసే ఎడిటింగ్ విభాగానికి తగిన గుర్తింపు.. ప్రచారం తక్కువ. ఇదే విషయంపై తాజాగా అమీర్ ఖాన్ .. మెగాస్టార్ చిరంజీవి ఉన్న వేదికపై ఓపెనయ్యారు ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేష్. అమీర్ ఖాన్ అంతటి దిగ్గజం ఉన్నారు కాబట్టే తాను ఈ వేదికకు వచ్చానని ఆయన అన్నారు. లేదంటే అటువైపే చూడనని ఆవేదన వ్యక్తం చేశారు.
సోమవారం రాత్రి జరిగిన `లవ్ స్టోరి` ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ సాంకేతిక నిపుణుల వెనకబాటుతనాన్ని గుర్తింపు లేని వైనాన్ని ఎత్తి చూపారు. ``సాధారణంగా మేము ఈ కార్యక్రమాలకు హాజరు కాము.. ఎందుకంటే తెలుగు చిత్ర పరిశ్రమలో టెక్నీషియన్లకు ఎలాంటి విలువ ఉండదు`` అని ఆయన అన్నారు. ``అమీర్ ఖాన్ గారు వస్తున్నారని చెప్పినప్పుడు మాత్రమే నేను ఈ వేదిక వద్దకు వచ్చాను. పాజిటివిటీని పొందడం కోసమే`` అని ఆయన అన్నారు.
టాలీవుడ్ కి దశాబ్ధాల పాటు సేవలందించిన మార్తాండ్.కె వెంకటేష్ వందలాది చిత్రాలకు ఎడిటర్ గా పని చేశారు. కానీ ఆయన లాంటి వాళ్లు ఎప్పుడూ తెరవెనకే ఉండిపోయారు కానీ వేదికలపై సముచిత గౌరవం అందుకున్నది లేదు. అప్పుడప్పుడు నంది అవార్డులు ఇతర అవార్డుల పేరుతో సన్మానాలు జరిగాయి కానీ ఇటీవల అవి కూడా లేవు. ఆడియోలు ఇతర ఫంక్షన్లలో కనీసం సాలువా సన్మానం అయినా ఉండదు. గుర్తింపు అంతంత మాత్రమే. అయితే ఇటీవలి కాలంలో కొందరు సంస్కారవంతులైన హీరోలు దర్శకనిర్మాతలు ప్రత్యేకించి టెక్నీషియన్ల గురించి వేదికలపై ఒక మాట చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి.. చరణ్ .. బన్ని.. లాంటి హీరోలు పదే పదే వేదికపై తమ టెక్నీషియన్ల పేర్లను గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. వేదికలపై సమయాభావం వల్ల చాలామంది సాంకేతిక నిపుణుల పేర్లను ప్రస్థావించరు. కానీ ఇటీవల కొందరు ప్రస్థావించడం గమనార్హం. ఎనిమిదేళ్ల క్రితమే తుపాకి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలోనూ మార్తాండ్.కె ఇండస్ట్రీలో వెనకబాటు తనం గురించి ప్రస్థావించారు. ఇప్పటికీ ఇండస్ట్రీలో ఎలాంటి మార్పు లేదని ఆయన చిరు-అమీర్ ఉన్న వేదికపై అన్నారంటే అర్థం చేసుకోవాలి.
రేవంత్ - మౌనిక ప్రేమకథ ..
నాగ చైతన్య- సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల రూపొందించిన లవ్ స్టోరి సెప్టెంబర్ 24న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. రేవంత్- మౌనికల ప్రేమ కథను తెరపై చూసేందుకు ఆడియెన్స్ కూడా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. తాజాగా లవ్ స్టోరి అన్ ప్లగ్ డ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని ఓ హోటళ్లో గ్రాండ్ గా నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి- బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ అతిథులుగా హాజరయ్యారు. అతిథులు టీమ్ కు బెస్ట్ విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు పవన్ సీహెచ్ మాట్లాడుతూ...మా సినిమా కార్యక్రమానికి అమీర్ ఖాన్ గారు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. లవ్ స్టోరి పాటలు ఇంత పెద్ద విజయం సాధించాయంటే అందుకు కారణం దర్శకుడు శేఖర్ కమ్ముల గారు. నాపై నమ్మకం ఉంచినందుకు ఆయనకు థాంక్స్. కేవలం సంగీతమే కాదు శేఖర్ గారితో జర్నీ చేసిన ఈ రెండేళ్లలో మంచి మనిషిగా కూడా మారాను. ఇదొక మెమొరబుల్ జర్నీ నాకు. మా సినిమాకు మంచి సాంగ్స్ రాసిన లిరిసిస్ట్స్ అందరికీ థాంక్స్`` అన్నారు.