Begin typing your search above and press return to search.
అమెరికాలో బాయ్ ఫ్రెండ్ తో సీనియర్ టాలీవుడ్ నటి..!
By: Tupaki Desk | 8 Nov 2021 10:30 AM GMTసినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ కు ప్రేమ వ్యవహారాలకు బ్రేకప్స్ కు కొదువ ఉండదని అంటుంటారు. దీనికి టాలీవుడ్ కూడా మినహాయింపు కాదు. ఫలానా వారి మధ్య ఏదో నడుస్తోందని.. వాళ్లిద్దరూ డేటింగ్ లో ఉన్నారని.. మొన్నటి దాకా చిలకా గోరింకల్లా తిరిగిన జంట విడిపోతున్నారని.. ఇలా రకరకాల రూమర్స్ వినిపిస్తుంటాయి. అందులో కొన్ని నిజమైతే మరికొన్ని ఊహాగానాలుగానే మిగిలిపోతుంటాయి. ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే.. టాలీవుడ్ సీనియర్ నటి ఒకరు ఇప్పుడు లేటు వయసులో ఘాటు ప్రేమాయణం సాగిస్తుందనే న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
తెలుగులో ఎన్నో సినిమాలు చేసిన ఆ సీనియర్ నటి.. ఒకప్పుడు దాదాపు అందరు హీరోల సరసన హీరోయిన్ గా నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా నటించింది.. నటిస్తూనే ఉంది. మామూలుగా షూటింగ్స్ లేనప్పుడు ఆ నటి అమెరికాకు వెళ్లి ఉంటున్నా.. ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే గత నెల రోజులుగా అమెరికాలో ఉంటున్న సదరు నటి.. ఇటీవల ఓ షాపింగ్ మాల్ లో కొందరు ఎన్నారై ల కంట పడిందట. అది కూడా ఓ బాయ్ ఫ్రెండ్ తో కలిసి కనిపించిందట.
ఈ సందర్భంగా అతను తన బాయ్ ఫ్రెండ్ అని సదరు నటి తెలుగు ఎన్నారై లకు పరిచయం చేసిందట. బాయ్ ఫ్రెండ్ అనేసరికి ఒక్కసారిగా వాళ్ళకి ఫ్యూజులు ఎగిరిపోయాయట. లేటు వయసులో ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఏంటి.. టాలీవుడ్ లో అంత మంచి పేరున్న ఈ నటికి ఇదేమీ బుద్ధో ఏమో అనుకున్నారట. అంతేకాదు ఆమె మాటలు వేషధారణ చూసి తెలుగు ఎన్నారై లకు ఒక్కసారి మన సమాజంలో ఏమి అవుతుంది.. అమెరికా కల్చర్ తెలుగు వాళ్ళకి కూడా వచ్చిందా అని బిత్తర పోయారట.
తన బాయ్ ఫ్రెండ్ ఆమె కంటే చాలా చిన్న వయసు ఉన్నవాడిలా కనిపిస్తున్నాడట. లేటు వయసులో డేటింగ్ లాంటి వ్యవహారాలన్నీ వెస్ట్రన్ కంట్రీస్ లో కామన్ గా జరుగుతాయి. కానీ ఇలా తెలుగు సీనియర్ నటికి బాయ్ ఫ్రెండ్ ఏంటని ఎన్నారై వాళ్ళు చర్చించుకుంటున్నారట. ఎందుకంటే సదరు టాలీవుడ్ సీనియర్ నటికి పెళ్ళై పిల్లలు ఉండటమే కాదు.. వారికి కూడా పెళ్లిళ్లు అయ్యాయట. మనవళ్లు మనవరాళ్లను ఎత్తుకునే వయసులో ఆమె బాయ్ ఫ్రెండ్ అంటూ చెట్టా పట్టాలేసుకొని తిరగడం చూసి ముక్కున వేలేసుకుంటున్నారట. ప్రస్తుతం వీరిద్దరి న్యూ జెర్సీ - న్యూయార్క్ వంటి ప్రాంతాల్లో తిరుగుతున్నారట. మరి ఈ లేటు వ్యవహారం ఎక్కడి దాకా వెళ్తుందో ఏమోనని ఎన్నారై వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.