Begin typing your search above and press return to search.

సెన్సేష‌న్.. ఆహా తెలుగులానే ఆహా త‌మిళం?

By:  Tupaki Desk   |   23 Jan 2022 10:30 AM GMT
సెన్సేష‌న్.. ఆహా తెలుగులానే ఆహా త‌మిళం?
X
ఓటీటీ ప్రాంతీయ విభాగంలో గొప్ప సంచ‌ల‌నంగా మారింది ఆహా-తెలుగు ఓటీటీ. ప్రారంభ‌మై రెండు సంవత్సరాల కంటే తక్కువ సమయంలో ఆహా తెలుగు డ‌యాస్పోరా(తెలుగు మాట్లాడేవాళ్లున్న‌చోట‌)లో అత్యంత ప్రజాదరణ పొందిన OTT ప్లాట్ ఫారమ్ లలో ఒకటిగా మారింది.

ఇప్పుడు ఈ వేదిక‌లో ఒరిజిన‌ల్ సినిమాలు ఒరిజినల్ షోస్ సంచ‌ల‌నంగా మారుతున్నాయి. ఇప్ప‌టికే పాపుల‌ర్ హిట్ చిత్రాలు - ఒరిజినల్ షోలు సిరీస్ లతో ఆహా గొప్ప కంటెంట్ లైబ్రరీ ని క‌లిగి ఉంది. ఆహా నిజానికి ప్రత్యేకమైన తెలుగు OTT ప్లాట్ ఫారమ్ గా ప్రారంభమైంది. ఇప్పుడు ఆహా తమిళ్ వేదికగా తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టేందుకు సిద్ధమైంది.

తాజా స‌మాచారం మేర‌కు.. ఆహా తమిళం జనవరి 28 నుండి ప్రారంభం కానుంద‌ని తెలిసింది. ఈ ప్లాట్ ఫారమ్ లో ఆరంభ‌మే క్రేజు ఉన్న చిత్రాల‌ను రిలీజ్ చేస్తున్నారు. మొదటి విడుదల సముద్రకని న‌టించిన తాజా చిత్రం రైట‌ర్ స్ట్రీమింగ్ అవుతుంది.

ఫ్రాంక్లిన్ జాకబ్ దర్శకత్వం వహించిన రైటర్ డిసెంబర్ 24న థియేటర్లలో విడుదలైంది. ప్రముఖ దర్శకుడు పా. రంజిత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రైటర్ తో పాటు మరో తమిళ చిత్రం పయనిగల్ గవనికవుమ్ కూడా ఆహా తమిళ్ లో ప్రీమియర్ గా ప్రదర్శించనున్నారు. ఈ సినిమా మలయాళంలో హిట్ అయిన వికృతికి అధికారిక రీమేక్. మునుముందు.. అనేక ఇతర ఒరిజినల్ షోలు సినిమాలతో కంటెంట్ లైబ్రరీని పెంచాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. ఆహా- తమిళ్ గురించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంటుంది.

తెలుగులో లానే త‌మిళంలో విజ‌యం సాధిస్తే త‌దుప‌రి మ‌ల‌యాళం- క‌న్న‌డ‌లోను ఇత‌ర భాష‌ల్లోనూ ఆహా విస్త‌రించేందుకు ఆస్కారం లేక‌పోలేదు. ఇక ఆహా అభివృద్ధి కోసం బాస్ అర‌వింద్- అల్లు అర్జున్ స‌హా టీమ్ లు ఎంతో గొప్ప హార్డ్ వ‌ర్క్ చేస్తున్నాయ‌న‌డంలో సందేహ‌మేం లేదు.

నిజాయితీగా మ‌న‌సు పెట్టి ప‌ని చేస్తే ఎంత‌టి విజ‌యం అయినా సాధించ‌వ‌చ్చ‌ని బాస్ అర‌వింద్ ప్ర‌తిసారీ చెబుతంటారు. ఇప్పుడు ఆహా విష‌యంలో దానిని నిజం చేస్తున్నారు. అస‌లు ఇది ఎవ‌రు చూస్తారు? అన్న‌వాళ్లే ఇప్పుడు ఆహాకి అడిక్ట్ అవుతున్నారు.