Begin typing your search above and press return to search.

'ఆర్ ఆర్ ఆర్'తో ఈ బంధం ముగిసిపోదు

By:  Tupaki Desk   |   30 Dec 2021 4:40 AM GMT
ఆర్ ఆర్ ఆర్తో ఈ బంధం ముగిసిపోదు
X
రాజమౌళి దర్శకత్వంలో .. డీవీవీ దానయ్య నిర్మాణంలో రూపొందిన 'ఆర్ ఆర్ ఆర్' సినిమాను ప్రపంచవ్యాప్తంగా జనవరి 7వ తేదీన విడుదల చేస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఈ సినిమా ప్రమోషన్స్ మరింత ఊపందుకున్నాయి. ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా టీమ్ త్రివేండ్రం వెళ్లింది. అక్కడ జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ .. "దక్షిణాది సినిమాకి తమిళనాడు షెల్టర్ ఇస్తే .. కేరళ సినిమా టెక్నాలజీకి బర్త్ నిచ్చింది. ఇండియన్ సినిమాకి ఈ నేల ఎంతో మంది గొప్ప టెక్నీషియన్స్ ను .. యాక్టర్స్ ను ఇచ్చింది.

ఒక్క మలయాళ ఇండస్ట్రీ ఇతర భాషలకి సంబంధించిన ఎన్నో సినిమాలకు స్పూర్తినిస్తూ ఉంటుంది. మీ మంచితనానికి .. మీ ఉన్నతమైన ఆలోచనలకి మరోసారి థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ రోజున ఇక్కడ ఇలా కలిసుకునేలా చేసిన శిబూ సార్ కి థ్యాంక్స్ చెబుతున్నాను. నా ఫస్టు బ్లాక్ బస్టర్ .. నాకు .. రాజమౌళి గారికి మధ్య ఇంతటి అనుబంధానికి కారణమైన 'సింహాద్రి'ని ఇక్కడే షూట్ చేశాము. ఈ వేదిక ద్వారా నేను రాజమౌళి గారికి థ్యాంక్స్ చెబుతున్నాను. 'ఆర్ ఆర్ ఆర్' సినిమా తీసినందుకు కాదు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన తరువాత ఆయనకి థ్యాంక్స్ చెబుతాను.

ఇప్పుడు ఎందుకు థ్యాంక్స్ చెబుతున్నానంటే, మరోసారి మమ్మల్ని కేరళ తీసుకువచ్చినందుకు. ఇలాంటి ఒక అద్భుతమైన సినిమాను నిర్మించినందుకు దానయ్య గారికి థ్యాంక్స్ చెబుతున్నాను. ఆయన ఎంతో ఓపికతో రాజమౌళి గారితో కలిసి ఈ సినిమాను చేశారు. ఆయన కెరియర్లోనే ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అవుతుంది. తోవినో ఒక వెర్సటైల్ యాక్టర్. ఈ నేల మహిమేమో .. ఒక మమ్ముట్టి .. మోహన్ లాల్ .. దుల్కర్ .. ఫహాద్ ఫాజిల్ .. తోవిన్ సార్ .. మీరంతా వెర్సటైల్ యాక్టర్స్ అయ్యారనిపిస్తోంది.

ఇక మా జక్కన్న గురించి చెప్పాలంటే .. దేశంలో ఆయనంత గొప్ప శిల్పి లేరు. భారతీయ సినిమా పరిశ్రమను ఆయన ఒక రేంజ్ కి తీసుకుని వెళుతున్నారు. అన్ని భాషలలోని ఆర్టిస్టులు చేసేలా .. అన్ని భాషల్లోని ప్రేక్షకులు చూసేలా .. ఆర్టిస్టుల మధ్య అనుబంధం .. ప్రేక్షకులు ఇతర ఆర్టిస్టులను ఆదరించేలా రాజమౌళి చేయగలిగారు. అందుకు మా జక్కన్నకు మరో సారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

ఒకప్పుడు మల్టీ స్టారర్స్ బాగా వచ్చాయి. అయితే ఆ తరువాత ఎందుకో ఆగిపోయాయి. అలాంటి మల్టీ స్టారర్స్ ను మళ్లీ జక్కన్న లైన్లో పెట్టారు. చరిత్రలో చరణ్ తో నా పేరు జోడించినందుకు ఆనందంగా ఉంది. చరణ్ చెప్పినట్టుగా నాలో కూడా ఆయన సగభాగమే. దేవుడికి ధన్యవాదాలు చెబుతున్నాను నా బ్రదర్ తో 200 రోజులు గడిపే అవకాశాన్ని ఇచ్చినందుకు. 'ఆర్ ఆర్ ఆర్' తో ఈ బంధం ముగిసిపోతుందని అనుకోవడం లేదు. ఎందుకంటే ఈ సినిమాకి ముందు నుంచి కూడా మేము మంచి స్నేహితులమే. మీరంతా చాలా దూరం నుంచి వచ్చి ఉంటారు. అందరూ కూడా జాగ్రత్తగా ఇళ్లకు చేరుకోండి" అంటూ ముగించాడు.