Begin typing your search above and press return to search.

ఆన్లైన్ లో బ్లాక్ టికెట్స్ అమ్ముతున్న సెన్సేషనల్ డైరెక్టర్...!

By:  Tupaki Desk   |   19 July 2020 3:30 AM GMT
ఆన్లైన్ లో బ్లాక్ టికెట్స్ అమ్ముతున్న సెన్సేషనల్ డైరెక్టర్...!
X
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన సినిమాల పబ్లిసిటీ విషయంలో కొత్త కొత్త ఐడియాలతో ముందుకెళతాడనే విషయం అందరికీ తెలిసిందే. టైటిల్ ప్రకటించిన దగ్గర నుండి నటీనటుల ఎంపిక వరకు ప్రతీదీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఉంటుంది. షూటింగ్ మొదలుకొని విడుదల వరకు అదనంగా రూపాయి ఖర్చు పెట్టకుండా తానే స్వయంగా సినిమాని పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటాడు. సోషల్ మీడియా మాధ్యమాలను ఉపయోగించుకునే 'క్లైమాక్స్' 'నగ్నం' లాంటి సినిమాలకి బజ్ క్రియేట్ చేయడం వర్మ ఒక్కడికే చెల్లింది. ఇక ఇటీవల 'పవర్ స్టార్' అనే సినిమా అనౌన్స్ చేసి సంచలనం రేపాడు. ఇప్పటికే 'పవర్ స్టార్' సినిమా పవన్ కళ్యాణ్ జీవిత కథ కాదని చెప్తూనే పవన్ కళ్యాణ్ - చిరంజీవి లను పోలిన నటులతో మూవీ రూపొందించి సినిమాకి కావాల్సినంత పబ్లిసిటీ తీసుకొచ్చాడు. ఇప్పుడు తాజాగా "పవర్ స్టార్" మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు వర్మ. 'పవర్ స్టార్' సినిమా జూలై 25న ఉదయం 11 గంటలకు www.rgvworldtheatre.com థియేటర్లో విడుదల కాబోతోందని ప్రకటించాడు. ఈ సినిమా కూడా పే ఫర్ వ్యూ పద్ధతిలోనే చూడాలని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా 'పవర్ స్టార్' సినిమా ప్రమోషన్స్ లో సినీ ఇండస్ట్రీ సైతం షాకయ్యేలా కొత్త స్ట్రాటజీతో వచ్చాడు వర్మ. సినీ చరిత్రలో ఇంతకముందు ఎన్నడూ లేని విధంగా సినిమా ట్రైలర్‌ కి కూడా టికెట్ ధర నిర్ణయించాడు. జూలై 22న ఉదయం 11 నుండి "పవర్ స్టార్" ట్రైలర్ ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో అందుబాటులో ఉంటుందని.. ఈ ట్రైలర్ చూడాలంటే పే ఫర్ వ్యూ పద్ధతిలో 25 రూపాయలు చెల్లించాలని పేర్కొన్నాడు. ఇది ప్రపంచంలో మొట్టమొదటి పెయిడ్ ట్రైలర్ అని చెప్పకొచ్చాడు. దీంతో సినీ చరిత్రలో ట్రైలర్‌ కి కూడా డబ్బులు వసూలు చేసిన ఏకైక వ్యక్తి రామ్ గోపాల్ వర్మ కానున్నారు. అంతేకాకుండా 'పవర్ స్టార్' సినిమా కోసం www.rgvworldtheatre.com లో 'ట్రైలర్ బుకింగ్' - 'అడ్వాన్స్ బుకింగ్' - 'బ్లాక్ బుకింగ్' - 'కరెంట్ బుకింగ్' అని 4 రకాల పే పర్ వ్యూ బుకింగ్స్ తీసుకొచ్చాడు. జూలై 25 ఉదయం 11 లోపు అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే టికెట్ ధర రూ. 150 అని.. అదే 11 గంటల తర్వాత బ్లాక్ లో టికెట్స్ కొన్నట్లు ధర రూ. 250 చెల్లించాల్సి ఉంటుందని.. ముందే బుక్ చేసుకుంటే రూ. 100 సేవ్ అవుతాయి.. త్వరపడండి అంటూ సలహా కూడా ఇస్తున్నాడు. మొత్తం వర్మ మీద ఆన్లైన్ లో బ్లాక్ టికెట్స్ అమ్మడం స్టార్ట్ చేసాడని.. కరోనా డేస్ ని క్యాష్ చేసుకుంటున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమాల విషయంలో ఎన్నో విన్నూత్నమైన మార్పులకు కారణమైన వర్మ కొత్త స్ట్రాటజీ ఇంకెన్ని మార్పులకు కారణం కాబోతోందో అని ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటున్నారు.