Begin typing your search above and press return to search.
నా దృష్టిలో ఈగే గొప్ప సినిమా
By: Tupaki Desk | 24 April 2017 9:05 AM GMTఒక క్రాఫ్ట్ పై మనకు ఎంతో పట్టు ఉంటే తప్ప ఒకరు వచ్చి ఏది చెప్పినా ఎలాంటి ఛాలెంజ్ ఇచ్చినా చేయడానికి వీలు అవుతుంది. అలాంటిది రాజమౌళి లాంటి ఒక దృశ్య కావ్యం తీయగల డైరెక్టర్ ఆలోచనని అందుకోవాలి అంటే ఎంత కష్టం కదా. అలాంటి ఊహాని అలవోకగా అర్ధం చేసుకోగల సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్.
''మనం బాహుబలి లో చాలా గొప్ప దృశ్యాలు చూశాం. ఇప్పుడు బాహుబలి 2 లో అంతా కన్నా ఆశ్చర్యకరమైన అద్భుతమైన విజువల్ లు మీరు చూడబోతున్నారు.ఈ సినిమా కోసం అందరూ రాత్రింబవళ్లు పని చేశాం. అందుకు తగ్గ గుర్తింపు వచ్చింది దానికి చాలా సంతోషంగా ఉంది. రాజమౌళి తో పని చేయడం చాలా కష్టం అయన కోరిన విజువల్ డిజైన్ చేయాలి అంటే చాలా ప్రిపేర్ కావాలి'' అంటున్నాడు సెంథిల్. అయితే మనోడు మాత్రం బాహుబలి కంటే ఈగ చాలా కష్టమైన సినిమా అని చెబుతున్నాడు. ''బాహుబలి కన్నా ఈగ కు ఎక్కువ కష్టపడ్డాను. దానికి చాలా కొత్త టెక్నాలజీ వాడాల్సి వచ్చింది. బాహుబలితో సహా చాలా సినిమాలకి.. క్యారెక్టర్ చుట్టూ విజువల్ ఎఫెక్ట్స్ ఉంటే.. ఈగలో మాత్రం.. లీడింగ్ హీరోనే విజువల్ ఎఫెక్ట్స్‌తో కూడుకొన్నది. అందుకు ఆ సినిమాకు ఎక్కువగా కష్టపడాల్సి వచ్చింది. అందుకే ఈగ గొప్ప సినిమా. ఏదేమైనా ఈ పనంతా నేర్పిన లెసన్స్ చూస్తుంటే.. ఇప్పుడు నేను డాక్టరేట్ పొందినంత ఆనందంలో ఉన్నాను'' అని చెప్పాడు.
మొత్తానికి 5 సంవత్సరాలు సరిగ్గా ఇంటికి కూడా వెళ్లని సెంథిల్.. ఇప్పుడు రోజూ ఇంటికెళ్ళి హ్యాపీగా పడుకుంటున్నాడట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/