Begin typing your search above and press return to search.
‘బాహుబలి-2’పై ఇంకా అంచనాలు పెంచేశాడు
By: Tupaki Desk | 9 Jan 2017 11:11 PM GMTఇప్పటికే ‘బాహుబలిః ది కంక్లూజన్’ మీద అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పుడా అంచనాల్ని మరింత పెంచే వ్యాఖ్యలతో బాహుబలి ప్రియుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్నాడు ఈ సినిమాకు ఛాయాగ్రహణం అందిస్తున్న సెంథిల్ కుమార్. ‘బాహుబలిః ది బిగినింగ్’ చూసిన వాళ్లందరూ ‘బాహుబలిః ది కంక్లూజన్’ కోసం ప్రిపేర్డ్ గా ఉంటారని.. అయినప్పటికీ వాళ్లందరూ రెండో పార్ట్ చూసి అబ్బురపడతారని వ్యాఖ్యానించాడు సెంథిల్.
‘‘బాహుబలి తొలి భాగం చూసి ఫిదా అయిపోయిన ప్రేక్షకులందరూ రెండో భాగం చూడ్డానికి ప్రిపేర్డ్ గా ఉంటారు. అయినా వాళ్లందరినీ బాహుబలి-2 మరింతగా అబ్బురపరుస్తుంది’’ అని రాజమౌళితో కలిసి సౌత్ కాంక్లేవ్ 17 కార్యక్రమంలో పాల్గొన్న సెంథిల్ అన్నాడు. బాహుబలి-1లో తాము చేయలేకపోయింది బాహుబలి-2లో చేశామని కూడా సెంథిల్ అన్నాడు. బాహుబలి-2లో ప్రతి ఫ్రేమ్ గొప్పగా ఉండేలా చూసుకున్నామని.. ఎమోషన్లు సరైన విధంగా పండేలా విజువల్స్ తీర్చిదిద్దామని తెలిపాడు.
మరోవైపు ‘బాహుబలి’కి ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్న సీనియర్ ఆర్ట్ డైరెక్టర్ సాబుసిరిల్ మాట్లాడుతూ.. తాను ఇప్పటిదాకా 150 సినిమాలకు పని చేసిన అనుభవంతో పోలిస్తే బాహుబలి భిన్నమైన అనుభవమని.. రెండు పార్టులకు కలిపి పని చేయడం 10 సినిమాలకు చేసినట్లు అనిపిచిందని.. ఈ సినిమాకు అంతగా శ్రమించామని తెలిపాడు.