Begin typing your search above and press return to search.
సెంటిమెంట్ తో వస్తున్న రామ్
By: Tupaki Desk | 30 Dec 2015 3:30 PM GMT సినిమా ఇండస్ట్రీ సెంటిమెంట్లకు పుట్టినిల్లు. ఇక్కడ స్టోరీ సిట్టింగులు మొదలుకొని గుమ్మడికాయ కొట్టేవరకు అన్నీ సెంటిమెంట్ల ప్రకారమే జరుగుతుంటాయి. అబ్బే మనకు సెంటిమెంట్లు పడవని చెప్పే కథానాయకులు సైతం నిర్మాతల నమ్మకాలకి తగ్గట్టుగా నడుచుకొంటుంటారు. ట్రెండ్ కి ప్రతిరూపంలా కనిపించే యువ కథానాయకుడు రామ్ సెంటిమెంట్లని నమ్ముతాడంటే ఎవరైనా నమ్ముతారా? కానీ మనోడు ఇప్పుడు సెంటిమెంట్ మేరకే తన చిత్రాన్ని విడుదల చేస్తున్నాడట.
గతేడాది జనవరి 1న రామ్ సొంత సంస్థయిన స్రవంతి మూవీస్ నుంచి రఘువరన్ బీటెక్ విడుదలైంది. అది ధనుష్ నటించిన చిత్రం. మొదట రామ్‌తో రీమేక్ చేద్దామనే రైట్స్ కొన్నాడు స్రవంతి రవికిషోర్. కానీ రామ్ మాత్రం దీన్ని డబ్బింగ్ వెర్షన్ గా విడుదల చేయడమే బెట్టర్ అని చెప్పాడట. అబ్బాయి నిర్ణయానికి తగ్గట్టుగానే రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోర్ రఘువరన్ బీటెక్ ని డబ్బ్ చేసి విడుదల చేశాడు. ఆ చిత్రం ఘన విజయం సాధించింది. రామ్ తో రీమేక్ చేసినా అన్ని లాభాలు వచ్చేవి కాదేమో. అంతగా వసూలు చేసింది ఆ చిత్రం. సరిగ్గా యేడాది తర్వాత జనవరి 1నే రామ్ చిత్రం `నేను.. శైలజ` విడుదల కాబోతోంది.
నిజానికి జనవరి 1న సినిమాల్ని విడుదల చేయడానికి ఎవ్వరూ అంత ఆసక్తి చూపరు. కానీ రామ్ మాత్రం రఘువరన్ బీటెక్ సక్సెస్ సాధించింది కాబట్టి సెంటిమెంటు ప్రకారం తనకీ 1వ తేదీ తప్పకుండా అచ్చొస్తుందని నమ్ముతున్నాడట. సో సెంటిమెంట్ తో వస్తున్న రామ్ సినిమా సక్సెస్ అయ్యిందంటే మాత్రం యేటా జనవరి 1కి ఆయన్నుంచి కొత్త సినిమాల్ని ఆశించొచ్చన్నమాట.