Begin typing your search above and press return to search.
'బంగార్రాజు'కి సెంటిమెంట్ డే ఫిక్స్!
By: Tupaki Desk | 21 Dec 2021 10:35 AM GMTఇండస్ట్రీలో సెంటిమెంట్ లకు పెద్ద పీట వేస్తుంటారన్నది తెలిసిందే. సినిమా ముహూర్తం నుంచి గుమ్మడికాయ కొట్టేదాకా.. డబ్బింగ్ ప్రారంభం నుంచి ఫైనల్ కాపీ బయటికి వచ్చేదాకా సినిమా అంతా సెంటిమెంట్ మీదే నడుస్తూ వుంటుంది. కాబట్టి ప్రతీ హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఖచ్చితంగా సెంటిమెంట్ లని ఫాలో అవుతుంటారు. ఇప్పుడు అదే సెంటిమెంట్ దగ్గర లాక్ అయ్యారు కింగ్ నాగార్జున. ఆయన నటిస్తున్న తాజా చిత్రం `బంగార్రాజు`. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.
నాగార్జున టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో చిన్న బంగార్రాజుగా అక్కినేని నాగచైతన్య కనిపించబోతున్నారు. రమ్యకృష్ణ, `ఉప్పెన` ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ తో కలిసి నాగార్జున నిర్మిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. మరో పక్క పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఫుల్ స్వింగులో నడుస్తున్నాయి. ఈ చిత్రాన్ని సంక్రాంతికి బరిలోకి
సైలెంట్ గా దించేస్తున్నారు. జనవరి 15న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
2016లో నాగ్ చేసిన చిత్రం `సోగ్గాడే చిన్ని నాయన`. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రానికి ప్రీక్వెల్ గా `బంగార్రాజు` చేస్తున్నారు. గతంలో జనవరి 15న విడుడుదలైన `సోగ్గాడే చిన్ని నాయనా` నాగ్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది. దీంతో ఆ సెంటిమెంట్ ని బలంగా నమ్మిన నాగార్జున `బంగార్రాజు`ని కూడా సెంటిమెంట్ ప్రకారం జనవరి 15నే సంక్రాంతి బరిలో దింపేయాలని ఫిక్స్ అయ్యారు. మరో రెండు మూడు రోజుల్లో రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటించే అవకాశం వుంది. `భీమ్లా నాయక్` పోటీ నుంచి తప్పుకోవడంతో `బంగార్రాజు`కు లైన్ క్లియరైందని చెబుతున్నారు.
ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్రంలోని పాటలు మంచి ఆదరణని సొంతం చేసుకుని సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. పైగా నాగ్ కి తోడు చిన బంగార్రాజు పాత్రలో నాగచైతన్య నటించడం.. వెండితెరపై తండ్రీ కొడుకుల హంగామా ఏవిధంగా వుండబోతోందో అని అందరిలోనూ ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. దీంతో సినిమా పై ఓ రేంజ్ లో అంచనాలు సెట్టయ్యాయి. దీనికి తోడు చిట్టి ఫరియా అబ్దుల్లా ప్రత్యేక గీతంలో కనిపించడం సినిమాకు మరింత హైప్ ని తీసుకొచ్చింది. మరి సెంటమెంట్ డేని ఈ సారి కూడా ఫిక్స్ చేసుకున్న నాగ్ `బంగర్రాజు` ఏ మేరకు మెప్పించి సెంటిమెంట్ ని రిపీట్ చేస్తాడో చూడాలి.