Begin typing your search above and press return to search.
ఇవన్నీ సెంటిమెంట్లేనా పవన్ కళ్యాణ్?
By: Tupaki Desk | 18 March 2016 10:30 PM GMTసర్దార్ గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ చేసేందుకు పవర్ పవన్ కళ్యాణ్ ఏ ఒక్క సెంటిమెంట్ ను విడిచిపెట్టడం లేదని అంటున్నారు సినీ జనాలు. అసలు పవన్ సెంటిమెంట్లు ఫాలో అవుతాడా అంటే.. స్ట్రయిట్ గా ఆన్సర్ చెప్పడం కష్టమే కానీ.. ఇప్పుడు పరిస్థితులను పరిశీలిస్తే మాత్రం.. నిజమే అని చెప్పకతప్పదు. ఇప్పుడు సర్దార్ పాటల్లో పవన్ గొంతు కలపడం కూడా ఈ సెంటిమెంట్లలో ఒక భాగమే అనే టాక్ వినిపిస్తోంది.
గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ కు మెగాస్టార్ చిరంజీవి వచ్చారు. అది సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అయింది. అందుకే ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో విడుదల వేడుకకు కూడా చిరును ఆహ్వానించాడని, ఆయన తప్పకుండా వస్తారని అంటున్నారు. అప్పటికి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన అత్తారింటికి దారేది చిత్రం కోసం పవన్ 'కాటం రాయుడా' అనే పాట పాడాడు. ఇప్పుడు సర్దార్ కోసం కూడా 'పోతురాజు.. పోతురాజు..' అంటూ ఓ సాంగ్ వేసుకున్నారంటున్నారు.
ఇక గబ్బర్ సింగ్ - అత్తారింటికి దారేది - సర్దార్ గబ్బర్ సింగ్ లకు మ్యూజిక్ ఇచ్చినది దేవిశ్రీ ప్రసాద్. ఆ లెక్కన ఇది కూడా పవన్ కి ఓ హిట్టు సెంటిమెంట్ కిందే లెక్క. మరి అన్ని సెంటిమెంట్లు కలిసి.. సర్దార్ గబ్బర్ సింగ్ ను బ్లాక్ బస్టర్ గా నిలపాలని ఫ్యాన్స్ తెగ ఆశలు పెట్టేసుకున్నారు. మరి వీరి హోప్స్ ఎంతమేరకు తీరతాయో తెలియాలంటే మాత్రం ఏప్రిల్ 8 వరకూ ఆగాల్సిందే.