Begin typing your search above and press return to search.
మహేష్ బాబు - గడ్డం..ఓ సెంటిమెంటు కథ!
By: Tupaki Desk | 24 July 2018 6:50 AM GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో సెంటిమెంట్లు ఎక్కువ. సినిమాలన్నీ లక్ష్మీదేవికి ఇష్టమైన శుక్రవారమే రిలీజ్ చేస్తారు.. తమకు కలిసి వచ్చిన రోజులు.. సీజన్ లోనే విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తారు.. ఇది అనాథిగా కొనసాగుతూనే ఉంది..
సినిమాల్లో కొత్తగా చేయాలి.. అప్పుడే ప్రేక్షకులు ఆదరిస్తారు. బాలీవుడ్ లో ఇది ఎప్పటినుంచో ఉంది. బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ అయితే చేయని పాత్ర లేదు.. అది డీ గ్లామర్ అయినా సరే పాత్ర కోసం ప్రాణాలిచ్చేస్తాడు. కానీ తెలుగులో ఆ ప్రయోగాలు తక్కువే అని చెప్పారు.. తెలుగు హీరోలు పెద్దగా ప్రయోగాలు చేయరనే విమర్శ ఎప్పటినుంచో ఉంది..
స్టార్ హీరోల్లో మహేష్ బాబు సెంటిమెంట్లను ఎక్కువగా నమ్ముతారని ఇండస్ట్రీలో ప్రచారం ఉంది. ఆయన తన సినిమాలకు ఎప్పుడూ మూడక్షరాల పేర్లనే పెడుతుంటాడు. మహేష్ సినీ ప్రయాణంలో బ్లాక్ బస్టర్స్ అన్నీ మూడక్షరాల పేర్లే.. మురారీ - అతడు - పోకిరీ - దూకుడు లాంటివి మహేష్ కు హిట్ ఇచ్చాయి. అందుకే ఇప్పటికీ ఆయన ఆ మూడక్షరాల టైటిల్ కోసం వెతుకుతుంటారనే పేరుంది.
ఇక కొత్తగా చేయడానికి మహేష్ బాబు రెండు మూడు సార్లు ఆలోచిస్తాడు. తాజాగా వంశీ పైడిపల్లి సినిమాలో క్యారెక్టర్ డిమాండ్ చేసినా గడ్డం పెంచడానికి మహేష్ చాలా తటపటాయించాడు. ఎందుకంటే గడ్డం పెంచితే తనకు కలిసిరాదనే అపోహ మహేష్ లో ఉండిపోయింది. గడ్డం పెంచి తీసిన టక్కరిదొంగ మూవీ మహేష్ కెరీర్ లో అతిపెద్ద ఫ్లాపుల్లో ఒకటి. ఆ సినిమా తర్వాత అసలు గడ్డం పెంచడానికి కూడా మహేష్ సాహసించడం లేదు. అందుకే వంవీ పైడిపెల్లి గడ్డం పెంచాలని రిక్వెస్ట్ చేసినా చేయడానికి మొదట ఒప్పుకోలేదని ఫిలింనగర్ నుంచి గుసగుసలు వినిపించాయి. చివరకు క్యారెక్టర్ కోసం ప్రస్తుతం గడ్డం పెంచి లుక్ మార్చాడు. మరి ఈ కొత్త గడ్డం గెటప్ మహేష్ సెంటిమెంట్ ను తోసిరాజని హిట్ కొడుతుందా.? లేదా అన్నది చూడాలి మరి..