Begin typing your search above and press return to search.
ట్యాలెంటెడ్ హీరో రొమాంటిక్ కామెడీకి సీక్వెల్ ప్లాన్
By: Tupaki Desk | 11 July 2021 5:30 AM GMTసుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం అనంతర పరిణామాలు తెలిసిందే. బాలీవుడ్ లో పెద్ద ఎత్తున ఇన్ సైడర్.. ఔట్ సైడర్ అనే పదాలు వినిపించాయి. బయటి నుంచి వచ్చిన హీరోలను నటవారసుల ముందు నిలబడనివ్వరని.. పరాయివాళ్లను రానిచ్చేందుకు బాలీవుడ్ మాఫియా ఒప్పుకోదని పెద్ద ఎత్తున ప్రచారమైంది. ఇకపోతే ఇండస్ట్రీ డీన్ కరణ్ జోహార్ ని వ్యతిరేకిస్తే ఆ హీరోకి భవిష్యత్ ఉండదని కూడా ప్రచారమైంది. కానీ అన్నిటినీ అధిగమించి కరణ్ జోహార్ తన ఫోన్ కాల్ స్వీకరించలేదని ఆడిషన్ చేయలేదని బహిరంగంగా కామెంట్ చేసి సంచలనాలకు తెరలేపాడు కుర్రహీరో ఆయుష్మాన్ ఖురానా.
ఔట్ సైడర్ గా బాలీవుడ్ లో అడుగుపెట్టినా తనదైన ప్రతిభ ఎంపికలతో అందరినీ ఆశ్చర్యపరుస్తూ వరస బ్లాక్ బస్టర్లు కొడుతున్నాడు. గొప్ప నటనతో మైమరిపిస్తున్నాడు. పరిశ్రమలో ఎందరు దిగ్గజాలు ఉన్నా ఆయుష్మాన్ కి ఒక రేంజుందని ప్రూవైంది. ఆయుష్మాన్ నటించిన చాలా సినిమాలు ఇరుగు పొరుగు భాషల్లోనూ రీమేకయ్యాయి. ముఖ్యంగా తెలుగులో అతడి ప్రతి సినిమా రీమేకవుతున్నాయి.
ఆయుష్మాన్ ఖురానా - నుష్రత్ భారుచా నటించిన కామిక్ కేపర్ `డ్రీమ్ గర్ల్ 2019లో రిలీజై భారీ విజయాన్ని సాధించింది. ఏక్తా కపూర్ నిర్మించిన ఈ చిత్రానికి రాజ్ షాండిల్యా దర్శకత్వం వహించారు. అతడే రచయిత. దేశవ్యాప్తంగా బాగా ఆదరణ దక్కించుకున్న చిత్రమిది. 90 వ దశకంలో గోవింద క్రేజీ కామెడీ చిత్రాలను గుర్తు చేసింది డ్రీమ్ గర్ల్. బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖుర్రానా కెరీర్ లోనే అతిపెద్ద హిట్ గా నిలిచి రూ. 142.26 కోట్లు వసూలు చేసింది.
ఆ తర్వాత డ్రీమ్ గర్ల్ నిర్మాతలు సీక్వెల్ సన్నాహకాల్లో పడ్డారు. డ్రీమ్ గర్ల్ థియేటర్లలోనే కాదు.. టెలివిజన్ లో కూడా బాగా ఆడింది. వీక్షకులు దీన్ని చాలా ఇష్టపడ్డారని పదేపదే చూస్తున్నారని ప్రూవైంది. ఇది మంచి ఆదరణ పొందిన చిత్రం. అందుకే అలాంటి చిరస్మరణీయ చిత్రానికి సీక్వెల్ తీయడం అర్ధవంతమైనది అని తాజాగా నిర్మాతలు ప్రకటించారు.
దర్శకుడు రాజ్ షాండిల్యా కొంతకాలంగా స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు అతను మరొక చిత్రానికి స్క్రిప్ట్ కోసం కూడా పని చేస్తున్నాడు. మొదట ఏ చిత్రం సెట్స్ పైకి వెళ్తుందనే దానిపై ప్రస్తుతం క్లారిటీ రావాల్సి ఉంది. ఇంకో నెలలో డ్రీమ్ గర్ల్ సీక్వెల్ పై పూర్తి క్లారిటీ రానుందని తెలుస్తోంది. మొత్తానికి సీక్వెల్ కోసం ఆయుష్మాన్ ఖుర్రానా తిరిగి రెడీ అవ్వాల్సి ఉంటుందని భావిస్తున్నారు. అతడు ఇంకా స్క్రిప్టును వినాల్సి ఉంటుంది.
డ్రీమ్ గర్ల్ మధురకు చెందిన నిరుద్యోగ యువకుడు కరంవీర్ అకా కర్మ్ (ఆయుష్మాన్ ఖుర్రానా) కథ.. అతను నాటకాల్లో స్త్రీ పాత్రలను పోషించి మెప్పిస్తాడు. ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో అతను ఫోన్ లో పురుషులతో సమ్మోహనకరంగా మాట్లాడుతున్న కాల్ సెంటర్ లో చేరవలసి వస్తుంది. అతని నలుగురు కస్టమర్లు - అతని బావమరిది మహేందర్ (అభిషేక్ బెనర్జీ).. హాట్ హెడ్ టీనేజర్ టోటో (రాజ్ భన్సాలీ).. ఒక కాప్-కమ్-షాయర్ రాజ్‌పాల్ (విజయ్ రాజ్) .. మనిషిని ద్వేషించే జర్నలిస్ట్ లతో కథ సాగుతుంది. వారితో కరంవీర్ కి ఎలాంటి ఇబ్బందులు తలెత్తాయి అన్నదే సినిమా.
రోమా (నిధి బిష్ట్) - పూజతో ప్రేమలో పడతారు. తరువాత రాహుల్ అనే కస్టమర్ ఆమెపై కామంతో కనిపిస్తాడు. అతని తండ్రి జగ్జీత్ (అన్నూ కపూర్) కొడుకు లవర్ పై కామంతో ఉన్నాడని తెలుసుకున్నప్పుడు కార్మ్ అతడి జీవితానికి పెద్ద షాక్ ఇస్తాడు... ఇలా ఆద్యంతం రొమాంటిక్ కామెడీ కథాంశంతో రంజింపజేసే చిత్రమిది.