Begin typing your search above and press return to search.
మహానాయకుడికి ఇదే అసలు ఛాలెంజ్
By: Tupaki Desk | 18 Jan 2019 1:30 AM GMTఎన్టీఆర్ కథానాయకుడు ఫలితం తేలిపోయింది. కంటెంట్ మీద పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా వసూళ్లు మాత్రం తీసికట్టుగా ఉండటంతో ఫైనల్ గా డిజాస్టర్ ముద్ర వేయించుకుంది. అయితే ఇప్పుడు రాబోయే మహానాయకుడు మీద అభిమానుల అంచనాలు సన్నగిల్లుతున్నాయి. ఒకవేళ కథానాయకుడు బ్లాక్ బస్టర్ అయ్యుంటే సీక్వెల్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడేది. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. అందుకే ముందు అనుకున్న ఫిబ్రవరి 7 కాకుండా 14న రిలీజ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టుగా ఇన్ సైడ్ టాక్. అయితే అభిమానులను టాలీవుడ్ సీక్వెల్ చరిత్ర భయపెడుతోంది. కారణం ఒక్క బాహుబలి తప్ప ఇప్పటిదాకా ఏ సీక్వెల్ టాలీవుడ్ లో ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.
గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ హిట్ అయితే సర్దార్ గబ్బర్ సింగ్ డిస్ట్రిబ్యూటర్లు కలలో సైతం తలుచుకునే పీడకలగా మిగిలింది. కిక్ రవితేజ కెరీర్ కు బూస్ట్ గా పనిచేస్తే ఆ తర్వాత వచ్చిన కిక్ 2 హీరోనే కాదు దర్శకుడిని కొన్నాళ్ల పాటు రిస్క్ లో పడేసింది. అల్లు అర్జున్ ని స్టార్ ని చేసిన ఆర్య మీద నమ్మకంతో ఆర్య 2 అంటే ప్రేక్షకులు సారీ అన్నారు. జగపతి బాబు మాస్టర్ క్లాసిక్ గాయంకు కొనసాగింపుగా గాయం 2 అంటే జనం థియేటర్ల నుంచి మాయం అయ్యారు. వర్మ సత్య ఒక చరిత్ర అయితే సత్య 2 ఒక బ్లాక్ స్పాట్. చార్మీ మంత్ర కూడా ఇదే బాపతులోకి వస్తుంది.
హీరో లేకపోయినా రక్త చరిత్ర హిట్ అయితే సూర్య అండగా ఉన్నా రక్త చరిత్ర 2 తేడా కొట్టింది. రవిబాబు అవును-కమల్ హాసన్ విశ్వరూపం-సూర్య సింగం-విక్రమ్ సామీ-విశాల్ పందెం కోడి ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని ఉదాహరణలు ఉన్నాయి. పాతికేళ్ల క్రితమే వర్మ మనీకి కంటిన్యూయేషన్ గా మనీ మనీ తీస్తే జనం ఒప్పుకోలేదు. సో సీక్వెల్స్ ట్రాక్ రికార్డు ఇంత బ్యాడ్ గా ఉంది. అయితే ఇక్కడ చెప్పిన ఉదాహరణలు అన్ని మొదటి భాగం సూపర్ హిట్ అయినవి. కానీ ఎన్టీఆర్ కేసు వేరు. కథానాయకుడు ప్లాప్ అనిపించుకున్నాక మహానాయకుడు వస్తోంది. సో సెంటిమెంట్ కి రివర్స్ లో ఇది హిట్ అవుతుందేమో అన్న ఆశతో ఉన్నారు అభిమానులు. ఏదేమైనా సౌత్ కు ఏ మాత్రం అచ్చిబాటు రాని సీక్వెల్ చరిత్రకు మహానాయకుడు బ్రేక్ వేస్తాడా. చూద్దాం.