Begin typing your search above and press return to search.

సీరియ‌స్ గా సామ్ డ్యాన్స్ రిహార్స‌ల్..!

By:  Tupaki Desk   |   21 Nov 2021 8:45 AM GMT
సీరియ‌స్ గా సామ్ డ్యాన్స్ రిహార్స‌ల్..!
X
క‌థానాయ‌కుడితో డ్యూయెట్ పాడుకోవ‌డం వేరు..! జ‌న‌రంజ‌కంగా కుర్రాళ్ల‌ను ఉర్రూత‌లూగించే స్పెష‌ల్ సాంగ్ కి న‌ర్తించ‌డం వేరు. రెండోది అంత సులువేమీ కాదు. బోల్డ్ లుక్స్ తో పాటు డ్యాన్సుల ప‌రంగా ఒక ఊపు తేవాలి. అయితే అది మెయిన్ స్ట్రీమ్ క‌థానాయిక‌ల‌కు పాజిబుల్ అవ్వాలంటే ఐట‌మ్ ఎక్స్ ప్రెష‌న్స్ ని కూడా కొంత అల‌వ‌డాల్సి ఉంటుంది. లేదంటే వీక్ష‌కుల‌కు అంత కిక్కు తేవ‌డం క‌ష్టం. అందుకే ఇప్పుడు స‌మంత త‌న స్పెష‌ల్ నంబ‌ర్ కోసం గ‌ట్టిగానే హార్డ్ వ‌ర్క్ చేస్తోంద‌ని తెలిసింది.

`పుష్ప‌- ది రైజ్`లో ఇది ఎంతో స్పెష‌ల్ గా ఉండేందుకు సామ్ చాలా హార్డ్ గానే శ్ర‌మించాల్సి ఉంటుంది. సుకుమార్ త‌న సినిమాల్లో ఈ పాట‌ను చాలా ప్ర‌త్యేకంగా తీర్చిదిద్దాల‌ని త‌పిస్తారు! కాబ‌ట్టి ఆ మేర‌కు సామ్ నుంచి అన్నిర‌కాల ఎక్స్ ప్రెష‌న్స్ ని ఆశిస్తారు. మ‌రి అందుకే స‌మంత ప్రాక్టీస్ సెష‌న్స్ ని ప్లాన్ చేసింది. ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఈ పాటను నవంబర్ 28 నుంచి చిత్రీకరించనున్నార‌ట‌.

సామ్ ఇప్పటికే డ్యాన్స్ రిహార్సల్స్ ప్రారంభించార‌ని టాక్. డిసెంబ‌ర్ 17న ఈ చిత్రం విడుద‌ల కానుంది. ఇందులో ర‌ష్మిక మంద‌న - ఫ‌హ‌ద్ ఫాజిల్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ ఫ్రాంఛైజీ రెండో భాగం తెర‌కెక్కాల్సి ఉంది.