Begin typing your search above and press return to search.

వీడియో: శేష్ - మీనాక్షీల బ్యూటిఫుల్ కెమిస్ట్రీని ఆవిష్కరించే రొమాంటిక్ గీతం..!

By:  Tupaki Desk   |   10 Nov 2022 7:13 AM GMT
వీడియో: శేష్ - మీనాక్షీల బ్యూటిఫుల్ కెమిస్ట్రీని ఆవిష్కరించే రొమాంటిక్ గీతం..!
X
నేచురల్ స్టార్ నాని సమర్పణలో టాలెంటెడ్ యాక్టర్ అడివి శేష్ - మీనాక్షీ చౌదరి జంటగా నటించిన తాజాగా చిత్రం "హిట్: ది సెకండ్ కేస్". విడుదలకు సిద్దమైన ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి.

ఇటీవల విడుదలైన 'హిట్ 2' టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ నేపథ్యంలో తాజాగా 'ఉరికే ఉరికే' అనే రొమాంటిక్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేయడం ద్వారా మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్ ను ప్రారంభించారు.

హైదరాబాద్ లోని మల్లారెడ్డి మహిళా ఇంజినీరింగ్ కళాశాల - MLR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరియు VNR VJIET కాలేజీ విద్యార్థుల సమక్షంలో "హిట్ 2" ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇది వరకే ప్రకటించారు.

ఇందులో భాగంగా ఈరోజు ఉదయం 'ఉరికే ఉరికే' పాటను లాంచ్ చేసారు. 'రానే వచ్చావా వానై నా కొరకే.. వేచే ఉన్నాలే.. నీతో తెచ్చావా ఏదో మైమరుప.. నువ్వే ఎదురున్నా తడుతూనే పిలిచాలే నిన్నే.. ఎవరంటూ' అంటూ సాగిన ఈ గీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

అడివి శేష్ మరియు మీనాక్షీ చౌదరి మధ్య బ్యూటిఫుల్ కెమిస్ట్రీని ఈ పాటలో చూడొచ్చు. పోలీసాఫీసర్ అయిన శేష్.. మీనాక్షి ప్రేమలో పడిన తర్వాత వారిద్దరి మధ్య రొమాంటిక్ మ్యాజికల్ మూమెంట్స్ ని ఇందులో చూపించారు.

ప్రధాన జంట మధ్య బెడ్ రూమ్ సన్నివేశాలను మరియు ఘాడమైన లిప్ లాక్స్ ను అందంగా చిత్రీకరించారు. విజువల్ గానూ ఈ పాట బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. శ్రీలేఖ చాలా గ్యాప్ తర్వాత ఓ అందమైన మెలోడీ ట్యూన్ తో వచ్చింది.

ట్యూన్ కు తగ్గట్టుగా గీత రచయిత కృష్ణ కాంత్ (కెకె) అర్థవంతమైన సాహిత్యాన్ని అందించారు. మ్యూజిక్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ తన శ్రావ్యమైన గాత్రంతో మరోసారి మ్యాజిక్ చేసాడని చెప్పాలి. శేష్ నటించిన 'మేజర్' సినిమా కోసం 'హృదయమా' పాట పాడిన సిద్.. ఇప్పుడు 'హిట్ 2' లో తన గోల్డెన్ వాయిస్ తో మంత్రముగ్దులను చేసాడు.

'ఉరికే ఉరికే' సాంగ్ ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ గా నిలిచి ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో ట్రెండ్ అవుతోంది. ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ లో వైలెన్స్ తో పాటుగా రొమాన్స్ కూడా ఉంటుందని హింట్ ఇచ్చింది. ఇది రాబోయే ప్రమోషనల్ కంటెంట్ మీద ఆసక్తిని రెట్టింపు చేసింది.

"హిట్ 2: ది సెకండ్ కేస్" చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఇది ఆయన దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన 'హిట్: ది ఫస్ట్ కేస్' చిత్రానికి సీక్వెల్. వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు.

ఇందులో అడివి శేష్ కృష్ణ దేవ్ అలియాస్ KD అనే కూల్ కాప్‌ గా కనిపించనున్నారు. పోసాని కృష్ణ మురళి - తనికెళ్ల భరణి - శ్రీకాంత్ మాగంటి మరియు కోమలీ ప్రసాద్ ఇతర పాత్రలు పోషించారు. జాన్ స్టీవర్ట్ ఎడూరి ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ సమకూర్చగా.. ఎస్ మణికందన్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ వర్క్ చేశారు.

"హిట్ 2" చిత్రాన్ని 2022 డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నాయి. మేజర్ సందీప్ గా పాన్ ఇండియా హిట్టు కొట్టిన అడివి శేష్.. ఈసారి హొమిసైడ్ ఇంటర్వెన్షన్ ఆఫీసర్ కేడీగా ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.