Begin typing your search above and press return to search.

'G2' డైరెక్ట‌ర్ ని మార్చేసిన శేషు...శ‌షి కిర‌ణ్ ఏమైనట్లు?

By:  Tupaki Desk   |   29 Dec 2022 11:28 AM GMT
G2  డైరెక్ట‌ర్ ని మార్చేసిన శేషు...శ‌షి కిర‌ణ్ ఏమైనట్లు?
X
అడ‌వి శేష్ హీరోగా 'జీ-2' (గుఢ‌చారి-2) ప్ర‌క‌ట‌నొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా నిర్మాణం కోసం ఏకంగా మూడు నిర్మాణ సంస్థ‌లు భాగ‌స్వామ్యం అయ్యాయి. ఈ సినిమాతో విన‌య్ కుమార్ సిరిగినీడి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. గ‌తంలో 'మేజ‌ర్' సినిమాకి ఎడిటింగ్ బాధ్య‌త‌లు చూసింది ఇత‌నే.

ఆ ప‌నిత‌నం మెచ్చే శేషు ఈ సినిమాకు ద‌ర్శ‌కుడిగా అవ‌కాశం క‌ల్పించిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఇక్క‌డే చాలా సందేహాల‌కు శేష్ తావిచ్చాడు. గుఢ‌చారికి తొలుత‌ ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది శ‌షికిర‌ణ్ తిక్క‌. ఆ త‌ర్వాత అదే కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన 'మేజ‌ర్' ఏకంగా పాన్ ఇండియాలోనే సంచ‌ల‌నం సృష్టించింది. ఆరకంగా శేష్ ఎదుగ‌ద‌ల‌లో శ‌షి కీల‌క పాత్ర‌ధారిగా ఉన్నాడు.

గుఢ‌చారి అంత పెద్ద స‌క్సెస్ కాక‌పోతే శేషు అంత ఫేమ‌స్ అయ్యేవాడు కాదు. ఆ సినిమాతోనే శేషు కి ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కింది. స్పై థ్రిల్ల‌ర్ న్యూ ట్రెండ్ ని సృష్టించాడు. ఆ సినిమా స్ర్కిప్ట్ ని ఇద్ద‌రు క‌లిసి త‌యారు చేసినా మేకింగ్ ప‌రంగా సినిమా హైలైట్ అయింది ద‌ర్శ‌కుడి వ‌ల్లే. అటుపై 'మేజ‌ర్' స‌క్సెస్ లోనూ శషి అంత‌కు మించిన గొప్ప పాత్ర పోషించాడు.

ప‌లు సంద‌ర్భాల్లోనూ 'గుఢ‌చారి-2' శిషినే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తాడ‌ని శేషు అన్నారు. క‌ట్ చేస్తే శషి స్థానంలో ఇప్పుడు కొత్త మేక‌ర్ వ‌చ్చాడు. దీనికి కార‌ణం ఏంటి? అన్న దానిపై ర‌క‌ర‌కాల సందేహాలు మొదల‌య్యాయి. శేషు-శ‌షిల మ‌ధ్య క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ త‌లెత్తాయా? లేక కొత్త మేక‌ర్ అయితే మేకింగ్ ప‌రంగా ఛేంజోవ‌ర్ ఉంటుంద‌ని శేషు ఇలా ప్లాన్ చేస్తున్నాడా? అనే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్నం అవుతున్నాయి.

మ‌రి వీటికి శేషు ఎలాంటి బ‌ధులిస్తాడో చూడాలి. ఆ కార‌ణాలు ఎలా ఉన్నా? శేషు ట్యాలెంటెడ్ గ‌య్స్ నే ముందుకు తీసుకొస్తాడన్న‌ది ఇప్పుడు ఇండ‌స్ర్టీ మాట‌. యంగ్ హీరో తో సినిమాలు నిర్మించ‌డానికి బ‌డా నిర్మాణ సంస్థ‌లు ముందుకొస్తున్నాయి. కంటెంట్ బేస్గ్ చిత్రాల‌కు మాత్ర‌మే ఆద‌ర‌ణ ద‌క్క‌డం తో నిర్మాత‌లంతా శేషు నే కోరుకుంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.