Begin typing your search above and press return to search.
వాట్సాఫ్‌లో సల్మాన్ జోకులు కేక
By: Tupaki Desk | 8 April 2015 1:30 AM GMT13 ఏళ్ల నాటి హిట్ అండ్ రన్ కేసులో ఈ మధ్య సల్మాన్ ఇచ్చిన వాంగ్మూలం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ రోజు యాక్సిడెంట్ చేసింది సల్మాన్ కాదు.. తానంటూ అతడి డ్రైవర్ సాక్ష్యం చెప్పడంతో అందరూ విస్మయానికి గురయ్యారు. మరి డ్రైవర్ సీటు నుంచి మీరే దిగారని సాక్ష్యులు చెబుతున్నారు కదా అని సల్మాన్‌ను అడిగితే.. వెనుక డోర్ తెరుచుకోకపోవడంతో ముందుకొచ్చి డ్రైవర్ సీటు వైపు నుంచి కిందికి దిగానని చెప్పాడు సల్మాన్. న్యాయ పరిధిలో ఉన్న అంశం కాబట్టి దీని గురించి డైరెక్టుగా విమర్శలు, కామెంట్లు చేసే అవకాశం లేదు జనాలకు.
అంతమాత్రాన విషయాన్ని తేలిగ్గా వదిలేస్తారా. తమ క్రియేటివిటీ చూపిస్తూ వాట్సాప్‌లో రెచ్చిపోతున్నారు. సల్మాన్ మీద తమకు ఒక్కసారిగా ఎలా గౌరవం పెరిగిపోయిందో చెబుతూ పెట్టిన ఈ కామెంట్ చూడండి. ''హిట్ అండ్ రన్ కేసులో తన డ్రైవర్‌ను కాపాడటం కోసం సల్మాన్ 13 ఏళ్ల పాటు ఆ నింద తన మీద వేసుకున్నాడా. అయ్యో పాపం.. సల్మాన్‌ది ఎంత జాలి గుండె. బీయింగ్ హ్యూమన్ అంటే ఇదే కదా'' అంటున్నారు జనాలు. అంతటితో ఆగకుండా.. సల్మాన్ మీద ఉన్న కృష్ణ జింకల కేసు గురించి పెట్టిన కామెంట్ కూడా అదుర్స్ అనే చెప్పాలి. సల్మాన్ నన్ను చంపలేదు. నేనే ఆత్మహత్య చేసుకున్నా.. అంటూ కృష్ణజింక పెట్టిన సుసైడ్ నోట్ రాజస్థాన్ అటవీ అధికారులకు దొరికిందని.. దాని ఆధారంగా సల్మాన్‌ను వదిలేయబోతున్నారు జోక్ పేల్చారు వాట్సాప్ చమత్కారులు.