Begin typing your search above and press return to search.
సునీల్ బాబూ.. సెటైర్లే సెటైర్లు
By: Tupaki Desk | 21 Feb 2016 3:30 PM GMTఅసలే సునీల్ హీరోగా కంటిన్యూ అవుతుండటంపై మెజారిటీ జనాల్లో సదభిప్రాయం లేదు. ఈ విషయంలో ఇండస్ట్రీ జనాల్లో బ్యాక్ సెటైర్లు ఎక్కువయ్యాయి. సునీల్ కు హీరో వేషాలు అవసరమా.. అతడేమైనా పెద్ద మాస్ హీరో అనుకుంటున్నాడా.. చక్కగా కమెడియన్ వేషాలు వేసుకోవచ్చు కదా.. ఈ తరహా సెటైర్లు చాలా చోట్ల వినిపిస్తున్నాయి. ఇలాంటి టైంలో ‘కృష్ణాష్టమి’ వచ్చి సునీల్ ను పెద్ద దెబ్బే కొట్టింది. ఈ సినిమా చూశాక సునీల్‌ను విమర్శించేవాళ్లకిక హద్దే లేకపోయింది. సామాన్య ప్రేక్షకులు సైతం సునీల్ మీద సెటైర్లు వేసేస్తున్నారు.
సునీల్ విమర్శకులకు బాగా ఛాన్స్ ఇస్తున్న ఓ అంశం ఏంటంటే.. సునీల్ తనను తాను రెగ్యులర్ మాస్ హీరోల్లాగా ప్రొజెక్ట్ చేసుకోవడం. సినిమాలో సప్తగిరి... సునీల్ ను చాలాసార్లు ‘బాబు’.. ‘బాబు’.. అని సంబోధించడం చూసే ఉంటారు. ఇది ఒకరకంగా ‘బాబు’లుగా పిలిపించుకునే హీరోల మీద సెటైర్ లాగా ఉంది. అదే సమయంలో సునీల్ తనను తాను ‘బాబు’లా అని ఫీలైపోతున్నాడన్న ఫీలింగూ కలిగిస్తోంది. ఇక సినిమాకు అవసరమా లేదా అని చూడకుండా సునీల్ సిక్స్ ప్యాక్ చేయడం.. దాని గురించి గొప్పలు చెప్పుకుంటూ డైలాగులు కూడా చెప్పడం కూడా జనాలకు అదో రకమైన ఫీలింగ్ కలిగిస్తోంది.
అయినా రెగ్యులర్ మాస్ సినిమాలు చేయడానికి.. ఫైట్లు - డ్యాన్సులు చేయడానికి ఇండస్ట్రీలో చాలామంది హీరోలుండగా.. సునీల్ ఇలాంటి వాటి కోసం వెంపర్లాడటమే విడ్డూరమైన విషయం. హీరోగా కొనసాగాలనుకునే విషయంలో అతణ్ని ఎవ్వరూ తప్పుబట్టరు. కానీ మిస్టర్ పెళ్లికొడుకు - కృష్ణాష్టమి తరహా సినిమాలు చేస్తేనే ఇబ్బంది. చక్కగా అందాల రాముడు - మర్యాదరామన్న తరహాలో తన ఇమేజ్ కు సరిపోయే కథలు ఎంచుకుంటే ఏ ఇబ్బందీ ఉండదు కదా.