Begin typing your search above and press return to search.
`డర్టీ హరి`ని మించే లాంటిదే మరొకటి?
By: Tupaki Desk | 1 Aug 2021 1:30 AM GMTరొటీన్ కంటెంట్ తో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటే రోజులు కావివి. ఈ విషయాన్ని ఒక వెటరన్ నిర్మాతగా ఎనలైజ్ చేసాక దర్శకుడిగా ఎం.ఎస్.రాజు ఆలోచనా విధానమే మారిపోయింది. ఆయన ఎంపిక చేసే కంటెంట్ సంథింగ్ హాట్.. సంథింగ్ స్పెషల్ గానూ కనిపిస్తోంది.
ఇంతకుముందు ఆయన డర్టీ హరి చిత్రంతో దర్శకుడిగా విజయం సాధించారు. యూత్ ని ఈ సినిమా థియేటర్లకు రప్పించింది. ఇందులో వేడెక్కించే కథానాయికలతో రాజు గారు మంచి ఔట్ పుట్ రాబట్టుకున్నారన్న ప్రశంసలు దక్కాయి. డర్టీ హరి తర్వాత `సెవెన్ డేస్ సిక్స్ నైట్స్` అంటూ మరో వేడెక్కించే సినిమాని తీస్తున్నారు. ఇది హాలీవుడ్ రియాలిటీ షో రేంజులో జంటల రోమాంచిత విన్యాసాలతో గుబులు రేగడం ఖాయమని తెరపై మంటలు పెడతారని అంచనా వేస్తున్నారు.
ఇటీవలే ఈ సినిమాతో పాటు `హరికథ` అనే మరో సినిమాని ప్రారంభించారు. ఈ చిత్రానికి తనయుడు సుమంత్ అశ్విన్ నిర్మాత. సంక్రాంతి 2022 రిలీజ్ లక్ష్యంగా తెరకెక్కించే సన్నాహకాల్లో ఉన్నారు. లాంచింగ్ ఎప్పుడు? అన్నది వేచి చూడాలి. `డర్టీ హరి`ని మించిన హరికథ ఇందులో చూపిస్తారా? అన్నదే ఇప్పటికి సస్పెన్స్. నటీనటులెవరు అన్నది తెలియాల్సి ఉంది. టైటిల్ పద్ధతిగా ఉంది కదా.. అని మరీ రొటీన్ సినిమా అయితే తీయరనే ఊహించవచ్చు. బాక్సాఫీస్ కలశాన్ని నింపడమే ఇప్పుడు ఫిలింమేకర్ ముందున్న తక్షణ కర్తవ్యం.