Begin typing your search above and press return to search.
ఆ హీరో కొడుకు అదరగొట్టేశాడు.. ఏకంగా 7 మెడళ్లు
By: Tupaki Desk | 26 Oct 2021 4:19 AM GMTరోటీన్ కు భిన్నమైన సినిమాలు.. డబ్బింగ్ మూవీస్ ద్వారా పరిచయమైన నటుడు మాధవన్. తెలుగులో నేరుగా చేసిన సినిమాలు లేవనే చెప్పాలి. భాష ఏదైనా.. పాత్ర మరేదైనా.. అందులో ఇట్టే ఇమిడిపోయే ఒకప్పటి చాక్లెట్ బాయ్ ఇమేజ్ ఉన్న మాధవన్ గురించి ఇప్పుడీ వార్త రాయటం లేదు. ఇప్పుడు అతడి కొడుకు టర్న్ వచ్చింది. తాజాగా ముగిసిన జాతీయ స్విమ్మింగ్ పోటీల్లో మాధవన్ కుమారుడు వేదాంత్ ఏకంగా ఏడు పతకాల్ని కొల్లగొట్టిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మరాింది.
బెంగళూరులోని బసవనగుడి అక్వాటిక్ సెంటర్ లో జూనియర్ నేషనల్ స్విమ్మింగ్ అక్వాటిక్ చాంపియన్ షిప్ 2021 పోటీల్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న పదహారేళ్ల వేదాంత్ ఏకంగా ఏడు మెడళ్లను సొంతం చేసుకున్నాడు. 800 మీటర్ల ప్రీస్టైల్.. 1500 మీటర్ల ప్రీస్టైల్.. 4×100 ఫ్రీస్టైల్ రిలే, 4×200 ఫ్రీస్టైల్ రిలే ఈవెంట్లలో రజత పతకాలు.. 100, 200, 400 మీటర్ల ఫ్రీస్టైల్ పోటీల్లో కాంస్య పతకాలు ఉన్నాయి.
ఈ టోర్నీలో ఏకంగా ఏడు పతకాల్ని సాధించిన నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీ ట్వీట్ చేస్తూ.. ‘‘గుడ్ జాబ్ వేదాంత్. మీ ప్రదర్శన పట్ల గర్విస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ఈ విషయం తెలిసిన పలువురు మాధవన్ ను ప్రశంసిస్తున్నారు.
మహారాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్న మాధవన్ కుమారుడు గత మార్చిలో లాత్వియన్ ఓపెన్ స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్ లోనూ కాంస్యంతో మెరిసాడు. ఇలా జాతీయ పోటీల్లో అదరగొట్టిన వేదాంత్ పతకాల సాధనపై ఇప్పుడు మరో టర్న్ తీసుకుంది.
వేదాంత్ ను పోలుస్తూ.. బాలీవుడ్ బాద్షా కుమారుడు ఆర్యన్ ఖాన్ ను తీవ్రంగా తప్పు పడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 16 ఏళ్ల వేదాంత్ దేశం కోసం పతకాలు సాధిస్తుంటే.. అదే సమయంలో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులోఅరెస్టుఅయ్యాడు. మాధవన్ కొడుకు సాధించిన పతకాల్ని ప్రశంసించటం బాగానే ఉన్నా.. ఆ పేరుతో షారుక్ కుమారుడ్ని పోలుస్తూ తిట్టిపోయటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.