Begin typing your search above and press return to search.
బ్యానర్ వల్ల భారీ ఓపెనింగ్స్ వస్తాయనుకుంటే పొరపాటే..!
By: Tupaki Desk | 19 March 2021 12:30 AM GMTకరోనా లాక్ డౌన్ తర్వాత తెలుగు సినీ ప్రేక్షకుల ఆలోచనల్లో అభిరుచిలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు విడుదలైన చిత్రాలను పరిశీలిస్తే కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే ఆడియన్స్ ఆదరించారు. ఈ క్రమంలో చాలా వరకూ సూపర్ డూపర్ హిట్లు కాగా, కొన్ని డిజాస్టర్లుగా మిగిలాయి. అయితే ఒకప్పటిలా బ్యానర్ బ్రాండ్ - పెద్ద బ్యానర్ లో సినిమా చేస్తే - అప్ కమింగ్ హీరోల సినిమాలకి భారీ ఓపెనింగ్స్ వచ్చేస్తాయనే ధోరణి పూర్తిగా మారిపోయిందని చెప్పవచ్చు. దీనికి ఉదాహరణగా ఇటీవలే విడుదలైన 'షాదీ ముబారక్' సినిమాని చెప్పుకోవచ్చు.
బుల్లితెరపై ఆర్కే నాయుడిగా తిరుగులేని క్రేజ్ ఉన్న సాగర్ హీరోగా నటించిన సినిమా 'షాదీ ముబారక్'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా కనీసం కలెక్షన్స్ రాబట్టలేకపోయిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. నిజానికి ఒకప్పుడు అప్ కమింగ్ హీరోల సినిమాల విషయంలో కేవలం దిల్ రాజు బ్యానర్ నేమ్ చూసే ఆడియన్స్ థియేటర్లకు వచ్చేవారు. అయితే ఇప్పుడు ప్రేక్షకులు మారిపోయారు. కంటెంట్ సరిగ్గా లేకపోతే ఆ సినిమా మీద కనికరం చూపించడం లేదు. సినిమా హిట్ టాక్ వస్తేనే నిర్మాతల జేబుల్లోకి డబ్బులు వెలుతున్నాయి. ఈ క్రమంలో యావరేజ్ సినిమాలకి కాలం చెల్లినట్లేనని అర్థం అవుతోంది. అలానే బ్యానర్ ద్వారా ఓపెనింగ్స్ వచ్చేస్తాయనుకొవడం పొరపాటే అని తెలుస్తోంది.