Begin typing your search above and press return to search.
శాకుంతలం క్లోజ్.. వసూళ్లు ఎంతంటే?
By: Tupaki Desk | 21 April 2023 1:01 PM GMTసమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'శాకుంతలం' చిత్రాన్ని అగ్ర నిర్మాత దిల్ రాజు సమర్పించిన విషయం తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 14వ తేదీన విడుదల అయింది. ఫుల్ నెగెటివ్ టాక్ రావడంతో రెండో రోజునే థియేటర్లకు వచ్చే వాళ్ల సంఖ్య సగానికి సగం తగ్గింది. దీంతో సినిమా డిజాస్టర్ గా నిలిచినట్లు తెలుస్తోంది.
అయితే చాలా ప్రాంతాల్లో షోలు లేకపోవడంతో సినిమాను దాదాపుగా తీసేశారట. ఇక త్వరలోనే దీన్ని పూర్తిగా క్లోజే చేసే పరిస్థితి కనిపిస్తోంది. అంతేకాకుండా సినిమాకు భారీగానే నష్టాలు వాటిల్లినట్లు అర్థం అవుతోంది. దాదాపు 12 నుంచి 13 కోట్ల మేర నష్టాలు వచ్చినట్లు సమాచారం. మరి వారం రోజుల పాటు ఎక్కడెక్కడ ఎంత మేర వసూళ్లు సాధించిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఏపీ నైజాంలో శాకుంతలం సినిమా 1.05 కోట్లు సాధించగా, సీడెడ్ లో 25 లక్షల, ఉత్తరాంధ్రలో 36 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 19 లక్షలు, వెస్టులో 12 లక్షలు, గుంటూరులో 17 లక్షలు, కృష్ణలో 19 లక్షలు, నెల్లూరులో 9 లక్షలు, ఏపీ తెలంగాణలో 6 రోజుల్లో శాకుంతలం 2.48 కోట్ల షేర్ రాబట్టుకొని 4.85 కోట్ల గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది.
ఏడు రోజుల్లో ఏపీ మొత్తం 2.48 కోట్ల షేర్, తమిళనాడులో 35 లక్షల షేర్, కర్ణాటక అలాగే రెస్టాఫ్ ఇండియా 38 లక్షల షేర్ ఇక ఓవర్సీస్ లో ఇప్పటి వరకు ఈ సినిమాకు ఒక కోటికి అటూ ఇటూగా షేర్ మాత్రమే దక్కించుకుంది. ప్రపంచ వ్యప్తంగా 4.28 కోట్ల రేంజ్ షేర్ కలెక్షన్లు, 9 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం.
వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా కేవలం 4 కోట్లకు పైగా మాత్రమే షేర్ కలెక్షన్లు వచ్చాయి. అయితే ఈ సినిమా టార్గెట్ 19 కోట్లు కాగా బాక్సాఫీసు వద్ద ఇంకా సుమారుగా 14 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్లు అందుకోవాల్సి ఉంది.
ఇంకో 12 నుంచి 13 కోట్ల వస్తే సినిమాకు ఎలాంటి నష్టాలు, లాభాలు రావు. కానీ ఇక ఈ సినిమా సర్దేసిన్లు తెలుస్తోంది. ఎక్కడా కూడా ఎక్కువగా ఆడట్లేదు. చూడాలి మరి ఏం జరగనుందో.