Begin typing your search above and press return to search.

బాలీవుడ్ స్టార్స్ పై పోలీస్ కంప్లైంట్‌!

By:  Tupaki Desk   |   25 Aug 2022 11:54 AM GMT
బాలీవుడ్ స్టార్స్ పై పోలీస్ కంప్లైంట్‌!
X
బాలీవుడ్ క‌రోనా స‌మ‌యం నుంచి గ‌డ్డు ప‌రిస్థితుల్ని ఎదుర్కొంటోంది. ఒక్క సినిమా కూడా ఆడ‌టం లూఏదు. కార్తీక్ ఆర్య‌న్ న‌టించిన `భూల్ భులాయా 2` త‌ప్ప బాలీవుడ్ నుంచి విడుద‌లైన ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వ‌ద్ద నిల‌బ‌డ‌లేక‌పోయింది. దీంతో బాలీవుడ్ వ‌రుస ఫ్లాపుల్ని ఎదుర్కొంటూ స్లంప్ లోకి వెళ్లిపోతోంది. సుశాంత్ సింగ్ ఆక‌స్మిక మృతి త‌రువాత బాలీవుడ్ కు క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. త‌న‌ని బాలీవుడ్ లో వున్న నెపోటిజ‌మే చంపేసిందంటూ ఫ్యాన్స్ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.

అంతే కాకుండా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి త‌రువాత నుంచి బాయ్ కాట్ బాలీవుడ్ అంటూ నెట్టింట ట్రెండ్ చేయ‌డం మొద‌లు పెట్టారు. అప్ప‌టి నుంచి బాలీవుడ్ కు చెందిన ఖాన్ ల త్ర‌యం న‌టించిన ప్ర‌తీ సినిమాని నెటిజ‌న్స్ టార్గెట్ చేస్తూ బాయ్ కాట్ నినాదంతో సోష‌ల్ మీడియాని హోరెత్తిస్తున్నారు. రీసెంట్ గా విడుద‌లైన బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ష‌నిస్ట్ అమీర్ ఖాన్ మూవీ `లాల్ సింగ్ చ‌డ్డా` ని కూడా బాయ్ కాట్ నినాదంతో మ‌ట్టి క‌రిపించారు.

భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైప ఈ మూవీ ఇండియ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద దారుణంగా విఫ‌ల‌మై ఆశించిన ఫ‌లితాన్ని రాబ‌ట్ట‌లేక‌పోయింది. దాదాపు నాలేగేళ్ల విరామం త‌రువాత అమీర్ ఖాన్ న‌టించిన ఈ మూవీ స‌రికొత్త రికార్డులు సృష్టిస్తుంద‌ని బాలీవుడ్ వ‌ర్గాలు భావించాయి. ఈ మూవీపై నే భారీ అంచ‌నాలు పెట్టుకున్నాయి. దీనితో అయినా బాలీవుడ్ భ‌విత‌వ్యం మారుతుంద‌ని ఆశ‌ప‌డ్డాయి. కానీ ప్లాన్ అంతా రివ‌ర్స్ అయి `లాల్ సింగ్ చ‌డ్డా` బాక్సాఫీస్ వ‌ద్ద దారుణంగా ఫ్లాప్ అయింది.

ఇక ఈ మూవీతో పాటే ఆగ‌స్టు 11న విడుద‌లైన `ర‌క్షాబంధ‌న్ `కూడా ఇదే ఫ‌లితాన్ని రాబ‌ట్టింది. అక్ష‌య్ కుమార్ న‌టించిన ఈ మూవీని ఫ్యామిలీ సెంటిమెంట్ అంశాల నేప‌థ్యంలో తెర‌కెక్కించారు. ఏ విష‌యంలోనూ ఈ మూవీ ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఇదిలా వుంటే అమీర్ ఖాన్ `లాల్ సింగ్ చ‌డ్డా`, జూలైలో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన తాప్సీ `శ‌భాష్ మిథూ` చిత్రాల‌పై పోలీస్ కంప్లైంట్ ఫిల్ అయిన‌ట్టుగా తెలుస్తోంది.

ఈ రెండు సినిమాల‌పై ఆరోప‌ణ‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అమీర్ ఖాన్ సినిమా మాన‌సిక విక‌లాంగుల్ని కించ‌ప‌రిస్తే అదే త‌రహాలో తాప్సీ న‌టించిన `శ‌బాష్ మిథూ` కించ‌ప‌రిచింది అంటూ కొంత మంది ఈ రెండు సినిమాల‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశార‌ట‌. కేసు ఫైల్ చేసిన పోలీసులు 30 రోజుల్లో వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఇరు సినిమాల వారికి నోటీసులు జారీ చేసిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.