Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్ : శభాష్ మిథూ ..తాప్సీ అదరగొట్టిందిగా!
By: Tupaki Desk | 20 Jun 2022 8:30 AM GMTబాలీవుడ్ లో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. ఈ తరహా చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న నేపథ్యంలో మేకర్స్ తో పాటు స్టార్స్ కూడా ఈ తరహా సినిమాల్లో నటించడానికి అమితాసక్తిని చూపిస్తున్నారు. దీంతో బ్యాక్ టు బ్యాక్ బయోపిక్ ల పరంపర బాలీవుడ్ లో కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా క్రికెటర్ల జీవితాలపై వస్తున్న సినిమాలే అత్యధికంగా సక్సెస్ అవుతున్న నేపథ్యంలో చాలా వరకు ఇదే నేపథ్య చిత్రాలని తెరకెక్కిస్తున్నారు.
ఎం.ఎస్ థోనీ, 83 వంటి చిత్రాలు ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలని సాధించాయి. ఈ నేపథ్యంలో మరో మహిళా క్రికెటర్ జీవిత కథ ఆధారంగా 'శభాష్ మిథూ' పేరుతో ఓ బయోపిక్ రూపొందుతోంది. మహిళా క్రికెట్ లో అత్యంత పాపులర్ గా నిలిచిన మిథాలీ రాజ్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. టైటిల్ పాత్రలో తాప్సీ నటించింది. శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీని వయాకమ్ 18 స్టూడియోస్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.
భరత మహిళ క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించి జట్టుని ప్రపంచ కప్ ఫైనల్ వరకు తీసుకెళ్లి తనదైన ఇన్నింగ్స్ తో చరిత్ర సృష్టించిన మిథాలీ రాజ్ జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల సమాహారం, ఆమె క్రికెట్ లో ఎదుర్కొన్న సవాళ్లు.. ఎదిగే క్రమంలో ఎదుర్కొన్న అవమానాలు, ఇబ్బందుల సమాహారంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఇటీవల విడుదల చేసిన టీజర్ తో ఈ మూవీపై అంచనాల్ని పెంచేసిన మేకర్స్ తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని సోమవారం విడుదల చేసి ఆ అంచనాల్ని మరింతగా పెంచేశారు.
పాపులర్ ఎడిటర్ ఏ. శ్రీకర్ ప్రసాద్ కట్ చేసిన ట్రైలర్ కు అమిత్ త్రివేది అందించిన నేపథ్య సంగీతం నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. ప్రేక్షకుల హర్షాధ్వానాల మధ్య జెర్సీ ధరించి బ్యాట్ చేత బట్టి మైదానంలోకి తాప్పీ అడుగుపెడుతున్న విజువల్స్ తో ట్రైలర్ మొదలైంది. నేను ఎనిమిదేళ్ల వయసులో వుండగా అ అమ్మ పురుషుల టీమ్ తరహాలోనే మహిళల టీమ్ కూడా వుంటుందని చెప్పింది' అంటూ తాప్సీ చెబుతున్న డైలాగ్ లు ఆకట్టుకుంటున్నాయి.
క్రికెట్ అంటే ఇష్టం వుందని తెలిసిన ఫ్యామిలీ తనని ఓ కోచ్ కి అప్పగించడం.. అక్కడ మిగతా వారు తాప్సీని టార్గెట్ చేయడం.. ఓ యువతి ఏకంగా నెట్ ప్రాక్టీస్ లో కావాలనే తాప్సీ మూతి పగిలేలా బౌన్సర్ వేయడం.. అది భరించలేక గాయం కారణంగా బ్లాడ్ కారుతున్న తీరు...ఇవన్నింటినీ వదిలేసి ఆటపై దృష్టిపెట్టమని కోచ్ చెప్పడంతో ఆటలో తనదైన నైపుణ్యాన్ని ప్రదర్శించిన తీరు ఆకట్టుకుంటోంది.
ట్రైలర్ ని బట్టి మిథాలీ పాత్రలో తాప్పీ అదరగొట్టేసిందని చెప్పొచ్చు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీని జూలై 15న భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. సినిమా ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడం గ్యారంటీ అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.