Begin typing your search above and press return to search.
సాహో: 24 గంటలు లబ్ డబ్
By: Tupaki Desk | 1 March 2019 5:09 AM GMTఇంకో 48 గంటలు ఆగడం కష్టమే. మరో 24 గంటల పాటు లబ్ డబ్ మామూలుగా ఉండదు. కోటాను కోట్ల అభిమానుల గుండెల్లో ఆ చప్పుడు ఇప్పటికే మొదలైంది. డార్లింగ్ ప్రభాస్ అభిమానులు గుండెను ఉగ్గబట్టి వేచి చూస్తున్నారు. ఫ్యాన్స్ లో కోలాహాలం కనిపిస్తోంది. మార్చి 3న `షేడ్స్ ఆఫ్ సాహో 2`- మేకింగ్ వీడియో రిలీజవుతోంది అని ప్రకటించగానే ఒకటే ఉత్కంఠ నెలకొంది. `షేడ్స్ ఆఫ్ సాహో మేకింగ్1` వీడియో సంచలనాల్ని మర్చిపోక ముందే మేకింగ్ లో పార్ట్ 2ని చిత్రయూనిట్ రిలీజ్ చేస్తోంది.
`షేడ్స్ ఆఫ్ సాహో` చాప్టర్ 2 కోసం వెయిటింగ్... ఒకటే ఉత్కంఠ...ఒకటే టెన్షన్ ప్రభాస్ అభిమానుల్లో నెలకొని ఉంది. తొలి వీడియోలో భారీ యాక్షన్ కొరియోగ్రఫీని ఎలివేట్ చేశారు. ప్రభాస్ స్టామినాని చూపించే యాక్షన్, కార్ ఛేజ్ లు, బైక్ ఛేజ్ లు.. అన్నిటికీ మించి ఖరీదైన ఫ్లైవోర్ బ్రిడ్జిపై విన్యాసాలు.. ఒకటేమిటి ప్రతిదీ రక్తి కట్టించాయి. అందుకే యూట్యూబ్ లో పది కోట్ల వ్యూస్ పైగా అందుకుంది ఈ వీడియో. ఇంకా ఇంకా దూసుకుపోతూనే ఉంది. అసలే డార్లింగ్ ప్రభాస్ ఆకలి మీద ఉన్నాడు. బాహుబలి సిరీస్ తర్వాత సుదీర్ఘ కాలం తన అభిమానుల్ని హోల్డ్ లో పెట్టిన ప్రభాస్ .. అందుకు తగ్గట్టే అద్భుతమైన విజువల్ ట్రీట్ ఇవ్వాలని కఠోరంగా తపిస్తున్నాడు. రేయింబవళ్లు సాహో సినిమా కోసం శ్రమిస్తున్నాడు. ఆ శ్రమ, ఆ కసి అతడి పెర్ఫామెన్స్ లో కనిపిస్తుందని అంతా అంచనా వేస్తున్నారు.
ప్రతిష్ఠాత్మక యువి క్రియేషన్స్ సంస్థ దాదాపు 225 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. అంతకుమించి బడ్జెట్ పెడుతున్నారన్న ప్రచారం ఉంది. ఇండియన్ సినిమా హిస్టరీలో ఎన్నడూ లేని అసాధారణ యాక్షన్ విన్యాసాల్ని ప్రేక్షకులకు చూపించనున్నారు. బాహుబలి 1, 2 చిత్రాలు పాన్ ఇండియా విజువల్స్ తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా 2500 కోట్లు వసూలు చేశాయి. ఇప్పుడు `సాహో` ఎంత వసూలు చేస్తుంది? అన్న క్యూరియాసిటీ ఊపేస్తోంది. అందుకే `షేడ్స్ ఆఫ్ సాహో మేకింగ్ 2`లో ఏం విశేషాలు ఉండబోతున్నాయి? అన్న ఉత్కంఠ అందరిలో ఉంది. ఓవైపు టాలీవుడ్ తో పాటు, అటు కోలీవుడ్, మాలీవుడ్, శాండల్వుడ్.. అలానే బాలీవుడ్ సైతం ఎంతో క్యూరియస్ గా వేచి చూస్తున్నాయి. బాహుబలి డిస్ట్రిబ్యూటర్ కరణ్ జోహార్, అలానే ప్రఖ్యాత క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ఈ సినిమా విషయమై ఎంతో క్యూరియాసిటీ కనబరుస్తున్నారు. తరణ్ ప్రత్యేకించి 'షేడ్స్ ఆఫ్ సాహో మేకింగ్ 2' గురించి ట్వీట్ చేశారు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఖాన్ ల తర్వాత అద్భుతమైన స్టామినా ఉన్న హీరోగా ప్రభాస్ పేరు మార్మోగిపోతోంది. ఈ సౌత్ హల్క్ నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి.