Begin typing your search above and press return to search.
సాహో చాప్టర్ 2: హాలీవుడ్ రేంజ్ లో ఉందే
By: Tupaki Desk | 3 March 2019 4:15 AM GMTడార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కళ్ళలో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్న సాహో విడుదలకు ఇంకా టైం ఉన్నప్పటికీ శ్రద్ధా కపూర్ పుట్టిన రోజును పురస్కరించుకుని టీమ్ ఇందాకా షేడ్స్ అఫ్ చాప్టర్ 2 పేరిట ఒక స్పెషల్ వీడియో విడుదల చేసింది. ఇంతకు ముందు రిలీజ్ చేసిన చాప్టర్ 1 అంత లెన్త్ లేకపోవడం అభిమానులకు కొంత నిరాశ కలిగించినప్పటికీ ఉన్న నిమిషంలోనే హాలీవుడ్ రేంజ్ రచ్చ చూపించేయడం విశేషం.
కథకు సంబంధించిన ఎలాంటి క్లూ లీక్ అవ్వకుండా కేవలం టెక్నీషియన్స్ వర్క్ మాత్రమే హై లైట్ అయ్యేలా చాలా జాగ్రత్తగా కట్ చేసిన ఈ వీడియోలో ప్రభాస్ రెండు మూడు షాట్స్ లో తప్ప ఎక్కడా స్పష్టంగా కనిపించడు. శ్రద్ధా కపూర్ చివర్లో గన్ చేత్తో పట్టుకుని బుల్లెట్స్ వదులుతుండగా చివర్లో ప్రభాస్ బూమ్ అనడం మాత్రమే ఇద్దరు విడివిడిగా స్పష్టంగా కనిపించే సన్నివేశం.
వీడియో ఆసాంతం ఇందులో ఏ స్టాండర్డ్ మేకింగ్ క్వాలిటీ చూపించారో ఒక్కో సన్నివేశం కోసం ఏ స్థాయిలో కష్టపడ్డారో చూస్తేనే ఒళ్ళు జలదరించేలా ఉంది. అన్ని మేకింగ్ షాట్స్ కాబట్టి వాటి గురించి పూర్తి అవగాహనతో కామెంట్ చేయడం కష్టమే. తెలుగు సినిమాల్లో చాలా అరుదుగా చూసే హాలీవుడ్ రేంజ్ ఎక్విప్ మెంట్ ఇందులో భారీ ఎత్తున వాడేశారు. రెండు వందల కోట్ల బడ్జెట్ అంటే ఏంటో అనుకుంటాం కానీ రెండు చాప్టర్లు కలిపి చూస్తే నిజమే అనిపిస్తుంది.
ప్రభాస్ మీద కట్ చేసిన ఫైట్ బిట్స్ వేగంగా సాగినా ఇందులో యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకునేందుకు చిన్న టీజర్ లా ఉపయోగపడింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో శంకర్ ఎహసాన్ లాయ్ ల మ్యూజిక్ కూడా బాగా ఎలివేట్ అయ్యింది. సాహో మీద అంచనాలు పెరిగేందుకు చాప్టర్ 2 దోహదపడేలా ఉంది