Begin typing your search above and press return to search.
#RRR టిక్కెట్టు ధరలపై రాజమౌళిపైనే ఒత్తిడి తెచ్చిన షాడో!
By: Tupaki Desk | 22 April 2021 7:30 AM GMTఏపీలో టిక్కెట్టు ధరల తగ్గింపు జీవో సంచలనంగా మారింది. ఈ జీవోతో పెద్ద సినిమాలపై అతి పెద్ద పంచ్ పడబోతోందన్న విశ్లేషణ సాగుతోంది. ఇది లాభాల్ని భారీగా తగ్గించేది.. అదనపు లాభాల్ని రాకుండా ఆపేది. అదే సమయంలో ఎగ్జిబిషన్ రంగానికి ఇది కొంతవరకూ ముప్పు అని ఒక వర్గం విశ్లేషిస్తోంది.
ఇదిలా ఉంటే అక్టోబర్ లో రిలీజ్ కి వస్తున్న పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ కి ఈ టిక్కెట్టు తగ్గింపు వల్ల ముప్పు ఎలా ఉండనుంది? అన్న విశ్లేషణ సాగుతోంది. నిజానికి క్రేజీ ఆర్.ఆర్.ఆర్ తో భారీ లాభాలార్జించాలని పెట్టుబడులు పెడుతున్న డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లకు ఇది తలనొప్పి వ్యవహారంగా మారిందిట.
ఏపీలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అయితే ఏకంగా ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ టిక్కెట్టు ధరల పై హైకోర్టుకు వెళ్లాలని ఇటీవల గిల్డ్ నిర్మాతల జూమ్ మీటింగులో సూచించారట. ముఖ్యంగా అతడు ఆర్.ఆర్.ఆర్ నిర్మాతలతో పాటు దర్శకుడు రాజమౌళి ప్రభృతులపై ఒత్తిడి తెచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే ఇదే గిల్డ్ జూమ్ మీటింగులో మరో ప్రముఖ నిర్మాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులకు వెళ్లడం అవివేకం అని వెనక్కి తగ్గమని సూచించారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ పెద్ద తేనె తుట్టనే కదిపారని అది అంతకంతకు రాజుకుపోతోందని కూడా చర్చ టాలీవుడ్ వర్గాల్ని వేడెక్కిస్తోంది. అన్నట్టు ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా జక్కన్న వేలు పెడతారా? అన్నది కూడా మరో వర్గంలో గుసగుసలకు తావిస్తోంది.