Begin typing your search above and press return to search.
ఆర్యన్ ను అరెస్ట్ చేసిన ఎన్సీబీకి షారుఖ్ ఫ్యాన్స్ థ్యాంక్స్ చెప్పాలట!
By: Tupaki Desk | 15 Oct 2021 3:59 AM GMTబాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ హీరోగా ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. ఒకటి రెండేళ్లలో ఆయన హీరోగా తెరంగేట్రం చేయడం కన్ఫర్మ్ అని అంతా అనుకుంటున్నారు. ఈ సమయంలో ఆయన అనూహ్యంగా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. గత పది రోజులుగా ఆర్యన్ డ్రగ్స్ కేసులో జైలులోనే ఉన్నాడు. బెయిల్ కోసం పదే పదే అప్పీల్ చేసుకుంటున్నా కూడా కోర్టు మాత్రం కేసు తీవ్రత దృష్ట్యా బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూనే ఉంది. ఈ సమయంలోనే షారుఖ్ ఖాన్ తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కొడుకు ను బయటకు తీసుకు వచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఈ సమయంలోనే వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ అందరు కూడా ఎన్ సీ బీ వారికి కృతజ్ఞతలు చెప్పాల్సిన సమయం ఇది అంటూ వింత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆర్యన్ ఎలాగూ హీరోగా పరిచయం అవ్వాలనుకుంటున్నాడు. అలాంటి ఆర్యన్ కు ఎన్ సీ బీ వారి వల్ల అనూహ్యంగా మంచి గుర్తింపు వచ్చింది. అతడు ఇంతకు ముందు వరకు కొద్ది మందికి మాత్రమే తెలుసు. కాని ఇప్పుడు అతడు దేశ వ్యాప్తంగా మోస్ట్ పాపులర్ స్టార్ గా నిలిచాడు. బాలీవుడ్ స్టార్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా ఆర్యన్ ఖాన్ గురించి జనాలు మాట్లాడుకుంటున్నారు.
కనుక ఆర్యన్ బయటకు వచ్చిన వెంటనే సినిమాను చేయడం వల్ల స్టార్ హీరోల సినిమా రేంజ్ లో ఆ సినిమా ఆడుతుందనే నమ్మకంను వర్మ వ్యక్తం చేశాడు. వర్మ లాజిక్ విభిన్నంగా ఉన్నా కూడా నిజమే అన్నట్లుగా ఉంది. ఈ సమయంలో షారుఖ్ ఖాన్ మరియు ఆయన అభిమానులు తీవ్ర దుఃఖంలో మునిగి ఉండగా వర్మ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం భావ్యం కాదని కొందరు అంటూ ఉంటే.. ఇంత కంటే షారుఖ్ మరియు ఆయన అభిమానులను ఓదార్చే వారు లేరు అంటూ కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. మొత్తానికి రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా విభిన్నంగా ఉంటుంది అనడానికి ఇది మరో నిదర్శణం. ఇప్పటికే చాలా పాపులారిటీ ఆర్యన్ కు జైలు జీవితం వల్ల వచ్చింది. కనుక ఇకపై అయినా ఆయన బయటకు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.