Begin typing your search above and press return to search.

ఫొటోస్టోరీ : గణేష్‌ పూజలో ఖాన్‌ తనయుడు

By:  Tupaki Desk   |   17 Sep 2018 10:38 AM GMT
ఫొటోస్టోరీ : గణేష్‌ పూజలో ఖాన్‌ తనయుడు
X
ఇండియాలో మత సామరస్యం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. హిందువుల పండుగల్లో ముస్లీంలు - ముస్లీంల పండుగల్లో హిందువులు పాల్గొనడం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా కొన్ని పండుగల్లో రెండు మతాల వారు ఎక్కువగా కలిసి పోయి జరుపుకుంటారు. అలాంటి పండుగల్లో ఒకటి గణేష్‌ చతుర్ధి. ఈ పండుగ సందర్బంగా పట్టణాలు - నగరాలు - గ్రామాలు అనే తేడా లేకుండా అంతటా కూడా గణేషుడి విగ్రహాలు ప్రతిష్టిస్తారు. బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ షారుఖ్‌ ఖాన్‌ ఇంట్లో కూడా గణేష్‌ చతుర్థి వేడుక జరుపుకుంటున్నారట.

తాజాగా షారుఖ్‌ ఖాన్‌ ఈ ఫొటోను సోషల్‌ మీడియాను పోస్ట్‌ చేశాడు. ఈ ఫొటోలో కనిపిస్తున్నది షారుఖ్‌ ఖాన్‌ చిన్న కొడుకు అబ్‌ రామ్‌. గణేషుడి విగ్రహం ముందు అబ్‌ రామ్‌ ఆశీర్వాదం తీసుకుంటున్నాడు అంటూ షారుఖ్‌ ఈ ఫొటోను పోస్ట్‌ చేసి కామెంట్‌ పెట్టాడు. బాలీవుడ్‌ స్టార్‌ హీరో అయిన షారుఖ్‌ తన పిల్లలకు సంబంధించిన విషయాలను సోషల్‌ మీడియాలో తరచుగా పోస్ట్‌ చేస్తూ ఉంటాడు. తాజాగా షారుఖ్‌ పోస్ట్‌ చేసిన ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

ముస్లీం అయిన షారుఖ్‌ ఫ్యామిలీ గణేష పూజను నిర్వహించి అందరికి ఆదర్శనీయంగా నిలిచింది. బాలీవుడ్‌ సెలబ్రెటీలు ఇలా మతసామరస్యంగా వ్యవహరించడం అభినందించాల్సిన విషయం అంటూ సోషల్‌ మీడియాలో షారుఖ్‌ పై ప్రశంసల జల్లు కురుస్తుంది. షారుఖ్‌ - గౌరీ ఖాన్‌ లకు ముగ్గురు సంతానం కాగా వారు ఆర్యన్‌ - సుహాన - అబ్‌ రామ్‌. సెలబ్రెటీలు ఇలా మతాలకు అతీతంగా వేడుకలు జరుపుకోవడం వారి అభిమానుల్లో కూడా మతసామరస్యంను పెంపొందించే అవకాశం ఉంది.