Begin typing your search above and press return to search.

షారుఖ్ మగాళ్లతో పడుకుంటాడని రూమరట

By:  Tupaki Desk   |   25 Oct 2016 10:30 PM GMT
షారుఖ్ మగాళ్లతో పడుకుంటాడని రూమరట
X
బాలీవుడ్లో ఒక హీరో తన భార్యతో ఓ పదేళ్లు కలిసి ఉంటే ఆశ్చర్యపోయే పరిస్థితి. అలాంటిది షారుఖ్ ఖాన్ తన భార్య గౌరీతో కలిసి ఏకంగా 25 ఏళ్ల వైవాహిక జీవితాన్ని పూర్తి చేసుకున్నాడు. ఇవాళే వాళ్లిద్దరూ 25వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. గౌరీని పెళ్లాడే సమయానికి షారుఖ్ అంత పెద్ద హీరో ఏమీ కాదు. కానీ ఆ తర్వాత కొన్నేళ్లకే సూపర్ స్టార్ అయిపోయాడు. బాలీవుడ్ బాద్షా అనిపించుకున్నాడు. ఐతే ఎంత ఎదిగినా గౌరితో బంధాన్ని అలాగే నిలబెట్టుకున్నాడు. ఇప్పటికీ వాళ్లిద్దరూ అన్యోన్యంగా జీవిస్తున్నారు. ఐతే తమ బంధం నిలవడంలో గౌరీ పాత్రే కీలకమని.. తన మీద ఎన్నెన్నో రూమర్లు వచ్చినా ఆమె అస్సలు పట్టించుకోదని అంటున్నాడు షారుఖ్.

తన మీద రకరకాల ఆరోపణలు వస్తూ ఉంటాయని.. తాను కోస్టార్లతో.. విదేశీ అమ్మాయిలతో.. చివరికి మగాళ్లతో కూడా పడుకుంటానని రకరకాల రూమర్లు వచ్చాయని.. కానీ తన భార్య వేటినీ పట్టించుకోదని షారుఖ్ చెప్పడం విశేషం. తనకు ఇలాంటివి చేసే సమయం ఉండదని తన భార్య భావిస్తుందని.. అందుకే అలాంటి ఆరోపణల్ని తేలిగ్గా కొట్టి పారేస్తుందని షారుఖ్ తెలిపాడు. 1991లో గౌరీని పెళ్లాడిన షారుఖ్.. ఆమెతో పిల్లలకు జన్మనిచ్చాడు. పెద్దబ్బాయి పేరు ఆర్యన్. కూతురు సుహానా. వీళ్లిద్దరూ మూడేళ్ల కిందట సరోగసీ ద్వారా రెండో అబ్బాయి అబ్ రామ్ కు జన్మనివ్వడం విశేషం. షారుఖ్ పెద్ద కొడుకు ఆర్యన్ త్వరలోనే హీరోగా పరిచయం కాబోతున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/