Begin typing your search above and press return to search.

మంచులో కాలు పెట్టగానే ఏం చేశాడంటే

By:  Tupaki Desk   |   25 April 2017 7:54 AM GMT
మంచులో కాలు పెట్టగానే ఏం చేశాడంటే
X
బాలీవుడ్ బాద్షా షారూఖ్‌ ఖాన్ ఎప్పుడు బిజీగానే ఉంటుంటాడు. మనం ఇప్పుడు ఈ ఆర్టికల్ చదువుకుంటున్న వేళ.. షారూఖ్ టెడ్ టాక్ లో మాట్లాడటానికి ఫారిన్ వెళుతున్నాడు. అయితే ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా తన పిల్లల కోసం ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. అలాంటి ఇంట్రెస్టింగ్ థింగ్ ఒకటి మనోడు ఈ మధ్యనే బయట పెట్టాడు.

ఒక ప్రొడక్షన్ కంపెనీ.. ఫిల్మ్ షూటింగ్స్.. ఈవెంట్.. ప్రమోషన్స్.. ఎండార్స్మెంట్స్.. ఇలా ఎన్ని ఉన్నా కూడా షారూఖ్‌ ఎప్పుడూ ఫ్యామిలీ కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. ఈ మధ్యనే సోషల్ మీడియాలో ఒక ఫోటో పోస్టు చేసిన షారూఖ్.. మదూరనుభూతి పొందుతూ ఇలా అన్నాడు.. ''చాలా ఏళ్ళు కిందట ఒకసారి నేను మొదటిసారిగా మంచులో అడుగుపెట్టాను. ఆ విషయం నా పిల్లలకు చూపించాలని ఈ ఫోటో తీసుకున్నా'' అంటూ ఒక ఫోటో షేర్ చశాడు. అందులో మంచులో తన కొడుకు ఆర్యన్.. కూతురు సుహానా పేర్లు ఉన్నాయి. ఈ ఫోటోను జాగ్రత్త పరిచిన జర్నలిస్ట్ ఇషికా మోహన్ కు చాలా థాంక్స్ చెప్పుకున్నాడు.

బాద్షా అయనా బీకారి అయన ప్రేమకు.. ప్రకృతికి ఫిధా అవ్వవలిసిందే. తొలిసారి మంచులో కాలు పెట్టగానే మరి షారూఖ్‌ అలాగే అయిపోయాడు. కాదంటారా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/