Begin typing your search above and press return to search.
షారూఖ్ కి ఇలా షాకిచ్చారేంటి!!
By: Tupaki Desk | 25 July 2016 11:45 AM GMTఇప్పటివరకు బ్లాక్ మనీని వెలికితీస్తాం అని చాలా ప్రభుత్వాలు చెప్పడమే కాని.. నిజానికి వారు బ్లాక్ మనీ కలిగారన్న ఏ ఒక్క వ్యాపారవేత్తను కూడా టచ్ చేస్తే ఒట్టు. కాని ఇప్పుడు దేశమంతా పనామా పేపర్స్ అంటూ లీక్ చేయబడిన డాక్యుమెంట్లను చూశాక.. అమితాబ్ బచ్చన్ - ఐశ్వర్య రాయ్ ఇలాంటి ప్రముఖలందరూ ట్యాక్సు ఎగవేసి ఫారిన్ కంట్రీలో సూట్ కేసు కంపెనీలు పెట్టుకుని వైట్ కాలర్ ఫైనాన్షియల్ అక్రమాలకు పాల్పడ్డారా అనే సందేహాలు వచ్చేశాయి. ఈ క్రమంలో నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఇక యాక్షన్ తీసుకోక తప్పట్లేదు.
ఇప్పటికే ఐ.టి.శాఖ అధికారులు నిఘాను మరింత కట్టుదిట్టం చేశారట.. ప్రత్యేకించి బాలీవుడ్ లో సంపాదనలో అగ్రస్థానాల్లో ఉంటున్న నటులపై వీళ్ళు ఫోకస్ పెట్టారు. వివిధ దేశాల్లో షారుక్ కి ఉన్న పెట్టుబడులు - ఆస్తుల వివరాలను వెల్లడించాల్సిందిగా ఆదాయ పన్నుశాఖ అధికారులు తాజాగా కింగ్ ఖాన్ షారుక్ కు నోటీసులు పంపారు. మనోడికి బెర్ముడా.. బ్రిటిష్ వర్జిన్ ఐల్యాండ్స్.. దుబాయ్ లలో.. చాలా పెట్టుబడులే ఉన్నాయట. అవన్నీ సవ్యమైన మార్గాల ద్వారా వెళ్ళాయా లేదా చెప్పమని నోటీసులు ఇచ్చారట.
అసలు పనామా పేపర్స్ షారూఖ్ ఖాన్ ప్రస్తావన రాకపోయినా.. ఐటి శాఖ మనోడికి ఇలాంటి షాకు ఎందుకిచ్చిందో తెలియదు. ఆ మధ్యన బాంబే మునిసిపల్ కార్పొరేషన్ ఈయన ఇంటి గోడను కొట్టేస్తే.. ఇప్పుడు ఐటి శాక అంతకంటే పెద్ద ఫీట్ చేద్దామని అనుకుంటున్నట్లుంది.