Begin typing your search above and press return to search.

ఆ స్టార్ హీరోకి మ‌రో 4 ఏళ్లు అజ్ఞాత‌వాసం త‌ప్ప‌దా?

By:  Tupaki Desk   |   18 Aug 2022 1:27 PM GMT
ఆ స్టార్ హీరోకి మ‌రో 4 ఏళ్లు అజ్ఞాత‌వాసం త‌ప్ప‌దా?
X
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నాలుగేళ్ల గ్యాప్ అనంత‌రం మ‌ళ్లీ వేగం పెంచిన సంగ‌తి తెలిసిందే. వ‌రుస‌గా కొత్త చిత్రాల్ని సెట్స్ పైకి తీసుకెళ్తున్నారు. నాలుగేళ్ల అజ్ఞాత‌వాసాన్ని ఒకేసారి ఫుల్ ఫిల్ చేసేలా? ప‌క్కా ప్లానింగ్ తో బ‌రిలోకి దిగుతున్నారు. 'ప‌ఠాన్'..'జ‌వాన్'.. 'డుంకీ' చిత్రాలు రెడీ అవుతున్నాయి. ఇప్ప‌టికే 'ప‌ఠాన్' షూటింగ్ ముగించి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ స్టేజ్ కి తీసుకొచ్చారు.

మిగ‌తా రెండు చిత్రాలు ఆన్ సెట్స్ లో ఉన్నాయి. షారుక్ ఈ నాలుగేళ్ల గ్యాప్ ఊర‌క‌నే తీసుకోలేదు. బాక్సా ఫీస్ షేక్ ఆడించే కంటెంట్ కోస‌మే ఇంత గ్యాప్ తీసుకున్నారు. 'చెన్నై ఎక్స్ ప్రెస్' త‌ర్వాత షారుక్ కి స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'జీరో' వ‌ర‌కూ భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన చిత్రాల‌న్నీ తీవ్ర నిరాశ‌ని మిగిల్చాయి. మ‌ధ్య‌లో 'హ్యాపీ న్యూయ‌ర్' ఊర‌ట‌నిచ్చింది.

కానీ బాద్ షా ఇమేజ్కి ఆసౌండింగ్ స‌రిపోదు. 'చెన్సై ఎక్స్ ప్రెస్' లా బాక్సాఫీస్ ని షేక్ చేసే హిట్ ఒక‌టి ప‌డాలి. ఆ విజ‌యంతో షారుక్ దాహం తీరాలి. నాలుగేళ్ల గ్యాప్ వెనుక ఇంత క‌మిట్ మెంట్ ఉంది. మ‌రి తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో మిస్ట‌ర్ ప‌ర్ పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ సైతం షారుక్ స్ట్రాట‌జీతో ముందుకు వెళ్లే అవ‌కాశం ఉందా? వ‌రుస ప‌రాజ‌యాలు గ్యాప్ అనివార్యం చేస్తున్నాయా? అంటే అవున‌నే అనిపిస్తుంది.

'దంగ‌ల్' త‌ర్వాత అమీర్ కి మ‌ళ్లీ స‌రైన స‌క్సెస్ ప‌డ‌లేదు. 'దంగ‌ల్' ఇమేజ్ తోనే భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన 'థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్' దారుణ‌మైన ఫ‌లితాన్ని చ‌వి చూసింది. అటుపై రిలీజ్ అయిన 'సీక్రెట్ సూప‌ర్ స్టార్స్' అలాంటి ఫ‌లితాన్నే అందుకుంది. దీంతో కొంత గ్యాప్ తీసుకుని 'లాల్ సింగ్ చ‌డ్డా' చేసాడు. ఈ సినిమా పై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నాడు. కానీ తొలి షోతోనే అవ‌న్నీ పేక మేడ‌లా కులిపోయాయి.

దీంతో మ‌రోసారి అమీర్ అంచ‌నాలు త‌ప్ప‌య్యాయి. అయితే ఈ సినిమా ఫ‌లితంపై అమీర్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు కీల‌క పాత్ర పోషించాయి అన్న‌ది వాస్త‌వం. రిలీజ్ కి ముందు సినిమాని బ్యాన్ చేయాలంటూ! సోష‌ల్ మీడియా వేదిక‌గా పిలుపునిచ్చిన నెటి జ‌నులు ఆ మాట నిల‌బెట్టుకునే వ‌ర‌కూ అవిశ్రామంగా ప‌నిచేసారు. చివ‌రికి వారు అనుకున్న‌ట్లే జ‌రిగింది.

ఒక్క‌ రోజులోనే 50 కోట్లు తేగ‌ల స్టార్ 10 కోట్ల వ‌సూళ్ల‌తో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చిందంటే? అమీర్ పై నెగిటివిటీ స్థాయిని అంచ‌నా వేయోచ్చు. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో అమీర్ కొన్నాళ్ల పాటు సినిమాల‌కు గ్యాప్ ప్ర‌క‌టించ‌డ‌మే మంచిద‌న్న అభిప్రాయ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ప్ర‌స్తుత‌మున్న ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ‌టానికి స‌మ‌యం ప‌డుతుంద‌ని అప్ప‌టివ‌ర‌కూ అమీర్ సినిమాలకు దూరంగా ఉంటేనే మంచిది అన్న వాద‌న బ‌లంగా వినిపిస్తుంది. నాలుగేళ్లు అంత‌కు మించి విరామంలో ఉంటేనే ? పరిస్థితుల‌న్నీ అదుపులోకి వ‌స్తాయ‌ని బాలీవుడ్ సైతం విశ్వ‌స్తుందిట‌. మ‌రి అమీర్ మ‌న‌సులో మాటేంటో? తెలియాలి.